దంతాలు తెల్ల‌గా మెర‌వాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోస‌మే!

సాధార‌ణంగా ముఖానికి అందాన్ని ఇచ్చేది న‌వ్వు.మ‌రి న‌వ్వు అందంగా ఉండాలంటే.

ప‌ళ్లు తెల్లగా, అందంగా ఉండాలి.కానీ, కొంద‌రు రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకున్నా.

ప‌ళ్లు మాత్రం తెల్ల‌గా ఉండ‌వు.దీంతో టూత్ పేస్ట్‌లు మారుస్తూనే ఉంటారు.

కానీ, ఫ‌లితం ఉండ‌దు.ఇందుకు చాలా కార‌ణాలు ఉంటాయి.

అయితే అలాంటి వారు చింతించ‌కుండా ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.మీ ప‌ళ్ల‌ను తెల్ల‌గా మెరిపించ‌వ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.బేకింగ్ సోడా దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, ముందుగా బేకింగ్ సోడాను తీసుకుని.అందులో కొద్దిగా నీరు మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ప‌ళ్ల‌కు కాసేపు రు‌ద్దుకోవాలి.అనంతరం నీటితో పళ్ల‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ప‌ళ్లు తెల్ల‌గా మార‌తాయి.రెండొవ‌ది.

కొన్ని తుల‌సి ఆకుల‌ను తీసుకుని బాగా ఎండ‌బెట్టుకోవాలి.బాగా ఎండిన తుల‌సి ఆకుల‌ను పొడి చేసుకుని.

దాంతో ప‌ళ్లును మూడు లేదా నాలుగు నిమిషాల పాటు రుద్దుకోవాలి.ఆ త‌ర్వాత దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా, అందంగా మార‌తాయి.మూడొవ‌ది.

ల‌వంగాల‌తో కూడా ప‌ళ్ల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.ల‌వంగాల‌ను పొడి చేసుకుని.

అందులో కొద్దిగా వాట‌ర్ క‌లిపి ప‌ళ్లు కాసేపు రుద్దుకోవాలి.అనంత‌రం నీటితో దంతాల‌ను క్లీన్‌గా శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే.ఖ‌చ్చితంగా దంతాలు తెల్ల‌గా, కాంతివంతంగా మార‌తాయి.

ఇక క్యారెట్స్, యాపిల్, జామ, వంటివి దంతాల‌ను తెల్ల‌గా, దృఢంగా మార్చ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, వీటిని త‌ర‌చూ తీసుకుంటే ప‌ళ్లు తెల్ల‌గా, అందంగా మార‌తాయి.అలాగే అర‌టి పండు తొక్క‌ను రెండు లేదా మూడు నిమిషాల పాటు దంతాల‌కు రుద్దుకోవాలి.

అనంత‌రం ప‌ళ్ల‌ను శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా దంతాలు తెల్ల‌గా మార‌తాయి.