చిగుళ్ల వాపు చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు.చిగుళ్లు వాచి పోయి నొప్పి పుడుతూ ఉండటమే.
చిగుళ్ల వాపు.ఒక్కోసారి చిగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంది.
బాక్టీరియా పేరుకు పోవడం, ఓరల్ హైజీన్ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల చిగుళ్ల వాపు సమస్య ఏర్పడుతూ ఉంటుంది.
ఇక ఈ సమస్యను తగ్గించుకునేందుకు రకరకాల మందులు వాడుతూ ఉంటారు.అయితే న్యాచురల్‌గా కొన్ని కొన్ని టిప్స్ పాటించి కూడా చిగుళ్ల వాపును నివారించుకోవచ్చు.
ముఖ్యంగా చిగుళ్ల వాపుకు చెక్ పెట్టడంలో అలోవెర అద్భుతంగా సహాయపడుతుంది.ఇంట్లో పెరిగే అలోవెరను తీసుకుని చిగుళ్ల వాపుపై అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల పాటు వదిలేసిఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేయాలి.
ఇలా తరచూ చేస్తే క్రమంగా చిగుళ్ల వాపు తగ్గిపోతుంది. """/"/
అలాగే పుదీనా ఆకులు కూడా చిగుళ్ల వాపుకు చెక్ పెట్టగలవు.
కొన్ని పుదీనా ఆకులు తీసుకుని లైట్‌గా క్రష్ చేసి వాటర్‌లో నానబెట్టాలి.ఈ వాటర్‌తో తరచుగా నోరు పుక్కిలిస్తూ ఉండాలి.
ఇలా చేస్తే చిగుళ్ల వాపు, రక్తం కారడం వంటి సమస్యలు దూరం అవుతాయి.
"""/"/
ఇక తేనెతో కూడా చిగుళ్ల వాపును తగ్గించుకోవచ్చు.స్వచ్ఛమైన తేనె తీసుకుని చిగుళ్ల వాసే అప్లై చేయాలి.
పది నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల కూడా వాపు తగ్గు ముఖం పడుతుంది.టీ ట్రీ ఆయిల్‌తో కూడా చిగుళ్ల వాపును సులభంగా నివారించుకోవచ్చు.
ఒక గ్లాస్ వాటర్‌లో రెండు చుక్కుల టీ ట్రీ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి.
ఆ వాటర్‌తో నోరు పుక్కిలిస్తూ ఉండాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.