షాంపూలో ఇవి క‌లిపి రాస్తే..సిల్కీ హెయిర్ మీసొంతం!

సాధార‌ణంగా చాలా మంది సిల్కీ హెయిర్‌నే ఇష్ట‌ప‌డుతుంటారు.కానీ, కొంద‌రి జుట్టు మాత్రం డ్రైగా, ర‌ఫ్‌గా ఉంటుంది.

ఇలాంటి వారు సిల్కీ హెయిర్ పొంద‌డం కోసం నానా తిప్ప‌లు ప‌డుతారు.ట్రీట్‌మెంట్లు చేయించుకుంటూ జుట్టును నాశ‌నం చేసుకుంటుంటారు.

అయితే న్యాచుర‌ల్‌గా కూడా జుట్టు సిల్కీగా మార్చుకోవ‌చ్చు.అది కూడా మీరు వాడే షాంపూకు కొన్నిటిని జ‌త చేసి వాడితే చాలా సుల‌భంగా మీ హెయిర్‌ను సిల్కీగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం.జుట్టు పొడిగా మ‌రియు ర‌ఫ్‌గా ఉన్న వారు ఎగ్ వైట్‌ను తీసుకుని షాంపూలో మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు బాగా ప‌ట్టించి అర గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేసేయాలి.సాధార‌ణంగా ఎగ్ త‌ల‌కు పెడితే స్మెల్ వ‌స్తుంటుంది.

కానీ, ఇప్పుడు చెప్పిన విధంగా పెడితే ఎలాంటి స్మెల్ రాదు.పైగా జుట్టు సిల్కీగా మ‌రియు ఒత్తుగా మారుతుంది.

"""/" / అలాగే ఒక బౌల్‌లో షాంపూతో పాటు ఆలోవెర జెల్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు బాగా ప‌ట్టించి ఇర‌వై నిమిషాలు పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే డ్రైగా, ర‌ఫ్‌గా ఉండే మీ హెయిర్ క్ర‌మంగా సిల్కీగా మారుతుంది.

"""/" / ఇక మీరు వాడే షాంపూలో ఇంట్లో త‌యారు చేసుకున్న రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

దీనిని హెయిర్‌కు అప్లై చేసి అర గంట పావు అర‌నివ్వాలి.ఆ త‌ర్వాత త‌ల స్నానం చేయాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేయ‌డం వల్ల‌ మీ జుట్టు సిల్కీగా మ‌రియు షైనీగా కూడా మారుతుంది.

గేమ్ ఛేంజర్ ఈవెంట్… అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్?