నల్లగా ఉన్న మోకాళ్లు తెల్లగా మారాలంటే ఇలా చేయండి!
TeluguStop.com
సాధారణంగా చాలా మంది మోకాళ్లు నల్లగా, రఫ్‌గా ఉంటాయి.దీని వల్ల ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ.
చర్మం మొత్తం తెల్లగా మోకాళ్లు నల్లగా ఉంటే కాస్త అందహీనంగా ఉంటాయి.అందుకే మోకాళ్లను తెల్లగా మార్చుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.
మార్కెట్‌లో దొరికే ఎన్నో క్రీములు రాస్తుంటారు.అయినప్పటికీ ఫలితం లేక బాధపడుతుంటారు.
అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఫాలో అయితే.ఖచ్చితంగా నల్లగా ఉన్న మీ మోకాళ్లు తెల్లగా మారతాయి.
మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర స్పూన్ పంచదార మరియు నిమ్మరసం వేసి కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోకాళ్లపై అప్లై చేసి.చాలా సున్నితంగా మర్ధనా చేయాలి.
అనంతరం చల్లటి నీటితో మోకాళ్లను శుభ్రం చేసుకోవాలి.ఇలా వారినికి రెండు సార్లు చేయడం వల్ల మోకాళ్లు క్రమంగా తెల్లగా మారతాయి.
రెండొవది.ఒక బౌల్‌లో కొద్దిగా వైట్ టూత్ పేస్ట్, నిమ్మరసం మరియు షాంపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోకాళ్లపై అప్లై చేసి.ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో మోకాళ్లను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే.
మోకాళ్లు తెల్లగా మారతాయి.మూడొవది.
ఒక బౌల్‌లో ఒక టీ స్పూన్ బియ్యంపిండి, అర టీ స్పూన్ పాలు, చిటికెడు పసుపు మరియు తేనె వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోకాళ్లుకు బాగా రుద్ది.ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తూ ఉంటే నల్లని మోకాళ్లు తెల్లగా మారతాయి.
బెస్ట్ నెక్ వైట్నింగ్ రెమెడీ ఇది.. తప్పక ప్రయత్నించండి..!