మొటిమలు మచ్చల్లా మారాయా..అయితే ఈ టిప్స్ మీకే!
TeluguStop.com
మొటిమలుస్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే సమస్య ఇది.
మొటిమలు వచ్చి రెండు, మూడు రోజులకు పోతే పర్వాలేరు.కానీ కొందరికి మొటిమలు వచ్చి చివరకు నల్ల మచ్చల్లా మారిపోతూ ఉంటాయి.
దాంతో ముఖకాంతి తీవ్రంగా దెబ్బ తింటుంది.ఎంత తెల్లగా ఉన్నా ఈ మచ్చల కారణంగా అందహీనంగా కనిపిస్తారు.
ఈ క్రమంలోనే మచ్చలను పోగొట్టుకునేందుకు రకరకాల క్రీములు వాడుతూ నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే న్యాచురల్‌గానే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను ఈజీగా నివారించుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పాల పొడి, షుగర్ పౌడర్ మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే మచ్చలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
"""/" /
అలాగే ఓట్స్‌ను పౌడర్‌లా చేసుకుని అందులో దోసకాయ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమానికి ముఖానికి అప్లై చేసి పావు గంట లేదా అర గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.
ఆ తర్వాత కూల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉన్నా మంచి ఫలితం ఉంటుంది.
"""/" /
ఇక ఆవాలతో కూడా మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను నివారించుకోవచ్చు.
ఆవాలను పొడి చేసుకుని అందులో తేనె వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమానికి మచ్చలు ఉన్న చోటు అప్లై చేసి.
పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా డే బై డే చేస్తూ ఉంటే మచ్చలు మటుమాయం అవుతాయి.
గర్ల్‌ఫ్రెండ్ లేని వారికి అదిరిపోయే ఐడియా.. ఈ జపనీస్ వ్యక్తి క్రియేటివిటీ అదుర్స్ ..?