నెల‌సరి నొప్పుల‌కు చెక్ పెట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

ఆడ‌వారిని ప్ర‌తి నెలా ఇబ్బంది అతి పెద్ద స‌మ‌స్య నెల‌స‌రి.ఆ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గ‌డం వ‌ల్ల‌ క‌డుపు నొప్పి, న‌డుము నొప్పి, కాళ్లు నొప్పి తీవ్రంగా ఉంటాయి.

ఈ నొప్పుల‌ను నివారించుకునేందుకు చాలా మంది పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌తారు.అయితే తాత్కాలికంగా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందించే పెయిన్ కిల్ల‌ర్స్.

భవిష్యత్‌లో మాత్రం అనేక సమస్యల‌ను తెచ్చిపెడ‌తాయి.అందుకే నెల‌స‌రి నొప్పుల‌ను స‌హజంగా త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

మ‌రి అందు కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.నెల‌స‌రి నొప్పుల‌కు చెక్ పెట్ట‌డంలో ఇంగువ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో చిటికెడు ఇంగువ మ‌రియు చిటికెడు ఉప్పు వేసి మిక్స్ చేసి తీసుకోవాలి.

ఇలా చేస్తే కొంత స‌మ‌యానికి నెల‌స‌రి స‌మ‌యంలో ఇబ్బంది పెట్టే నొప్పులు ప‌రార్ అవుతాయి.

అల్లం కూడా నెల‌స‌రి స‌మ‌యంతో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. """/" / ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో రెండు స్పూన్ల‌ అల్లం ర‌సం, ఒక స్పూన్ నిమ్మ ర‌సం మ‌రియు కొద్దిగా ప‌టిక బెల్లం పొడి వేసి క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేసినా నెల‌స‌రి నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.ఈ టిప్స్‌తో పాటు నెల‌స‌రి స‌మ‌యంలో బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌, ఆయిల్ ఫుడ్, కార్బనేటెడ్ పానీయాలు, కెఫిన్, అధిక ఉప్పు ఉన్న ఫుడ్స్ కుదూరంగా ఉండాలి.

వీటి వల్ల జీర్ణ సమస్యల‌తో పాటు నెల‌స‌రి నొప్పులు కూడా ఎక్కువ అవుతాయి.

పొత్తికడుపు మరియు నడుము వద్ద నొప్పి ఎక్కువ‌గా ఉంటే.వేడితో కాపడం పెట్టుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

ఇక నెల‌స‌రి స‌మ‌యంలో పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.వేడి నీటితోనే స్నానం చేయాలి.

ఎందుకంటే, నొప్పుల‌ను నివారించ‌డంలో వేడి నీటి స్నానం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌శాంతంగా కాసేపు వాకింగ్ చేయ‌డం, యోగా చేయ‌డం వ‌ల్ల కూడా నెల‌స‌రి నొప్పులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

నేను ఎవరికి భయపడే టైపు కాదు : వనిత విజయ్ కుమార్ కూతురు