క‌ళ్ల కింద ముడ‌త‌లా..అయితే ఈ సూప‌ర్‌ టిప్స్ మీకే!

సాధార‌ణంగా కొంద‌రికి క‌ళ్ల కింద ముడ‌త‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, గంట‌లు త‌ర‌బ‌డి ఫోన్లు.

ల్యాప్‌టాప్లు వాడ‌టం, పోష‌కాల లోపం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల కింద ముడ‌త‌లు వ‌స్తుంటాయి.

ఈ ముడ‌త‌లు అందాన్ని త‌గ్గించ‌డంతో పాటు వ‌య‌సు పైబ‌డిన వారిలా చూపిస్తాయి.అందుకే ఈ ముడ‌త‌ల‌ను నివారించుకునేందుకు ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు కొనుగోలు చేసి వాడ‌తారు.

కానీ, ఇంట్లో న్యాచుర‌ల్‌గానే క‌ళ్ల కింద ఏర్ప‌డిన ముడ‌త‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్ క‌ళ్ల  కింద వ‌చ్చిన ముడ‌త‌ల‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.పైనాపిల్ నుంచి ర‌సం తీసుకుని అందులో చిటికెడు ప‌సుపు మ‌రియు కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద అప్లై చేసి.పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తూ ఉంటే ముడ‌త‌లు మ‌టుమాయం అవుతాయి. """/" / దోస‌కాయ కూడా క‌ళ్ల కింద ఏర్ప‌డిన ముడ‌త‌ల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు.

దోస‌కాయ తొక్క మ‌రియు లోప‌ల ఉండే గింజ‌లు తీసేసి .మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు వేసి క‌లిపి క‌ళ్ల కింద అప్లై చేయాలి.

ప‌ది, ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక ఒక బౌల్‌లో బాదం నూనె, కొబ్బ‌రి నూనె స‌మానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద అప్లై చేసి.మెల్ల మెల్ల‌గా వేళ్ల‌తో రెండు, మూడు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

ప్ర‌తి రోజు రాత్రి ప‌డుకునే ముందు ఇలా చేసి.ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా ముడ‌త‌లు త‌గ్గుతాయి.

తప్పుడు కథనాలు నమ్మొద్దు..: నటుడు శ్రీకాంత్