వాచిన చిగుళ్ళ‌ను నివారించే బెస్ట్ టిప్స్ మీకోసం!

వాచిన చిగుళ్ళ‌ను నివారించే బెస్ట్ టిప్స్ మీకోసం!

సాధార‌ణంగా ఒక్కో సారి పంటి చిగుళ్ళు వాపుకు గుర‌వుతూ ఉంటాయి.దాంతో తీవ్ర‌మైన నొప్పి పుట్ట‌డంతో పాటు ర‌క్త‌స్ర‌వం కూడా అవుతుంటుంది.

వాచిన చిగుళ్ళ‌ను నివారించే బెస్ట్ టిప్స్ మీకోసం!

నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం, పోషకాల లోపం, ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్, పొగాకు న‌మ‌ల‌డం, ఒత్తిడి, చిగుళ్ళ మధ్యన పాచి పేరుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యతలు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చిగుళ్ళ వాపు స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

వాచిన చిగుళ్ళ‌ను నివారించే బెస్ట్ టిప్స్ మీకోసం!

దీనిని ఎలా నివారించుకోవాలో తెలియ‌క చాలా మంది నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ పాటిస్తే.

సులువుగా వాచిన చిగుళ్ళ‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

చిగుళ్ళ వాపును త‌గ్గించ‌డంలో ల‌వంగాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.ల‌వంగాల‌ను పొడి చేసి.

ఆ త‌ర్వాత అందులో కొద్దిగా గొరు వెచ్చ‌ని నీరు క‌లిపి పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌ను వాచిన చిగుళ్ళ‌పై అప్లై చేసి.ప‌ది నిమిషాల అనంత‌రం నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చిగుళ్ళ వాపు త‌గ్గుతుంది.అలాగే గ్రీన్ టీ బ్యాగ్‌తో కూడా చిగుళ్ళ వాపుకు చెక్ పెట్ట వ‌చ్చు.

"""/" / ముందుగా గోరు వెచ్చ‌ని నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ డిప్ చేసి.

మూడు, నాలుగు నిమిషాల త‌ర్వాత ఆ బ్యాగ్‌ను వాపు ఉన్న చోటు పెట్టుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేస్తుంటే.క్ర‌మంగా చిగుళ్ళ వాపు త‌గ్గు ముఖం ప‌డుతుంది.

చిగుళ్ళ వాపును మ‌టు మాయం చేయ‌డంలో క‌ల‌బంద కూడా గ్రేట్‌గా స‌మాయ‌ప‌డుతుంది.ముందుగా ఒక గ్లాస్ వాట‌ర్‌తో క‌ల‌బంద గుజ్జు వేసి మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ వాట‌ర్‌ను నోట్లో వేసుకుని.కాసేపు ఉంచుకోవాలి.

ఆ త‌ర్వాత ఊసేసి మంచి నీళ్ళతో నోటిని శుభ్రం చేసుకోవాలి.ఇలా ఉద‌యం, సాయంత్రం చేస్తూ ఉంటే.

చిగుళ్ళ వాపు సుల‌భంగా త‌గ్గుతుంది.