దోమ కాటు వల్ల వచ్చే దద్దుర్లను ఉల్లితో నివారించుకోండిలా?
TeluguStop.com
ఎక్కడ చూసినా దోమలే.కుట్టి చంపేయడానికి రెడీగా ఉంటాయి.
డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించేలా ఈ దోమలను తరిమికొట్టేందుకు.ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
ఎన్ని చేసినా సాయంతం ఆరు గంటలు అయిందంటే చాలు.దోమలు దండయాత్ర మొదలు పెడతాయి.
ఇక దోమ కాటుకు గురైతే.దద్దర్లు వస్తాయి.
కొంత సేపటికి పోతాయి.కానీ, కొందరిలో మాత్రం ఈ దద్దుర్లు పోకుంటా మంట, నొప్పి పుడుతుంటాయి.
అలాంటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే.సులువుగా దద్దుర్లను నివారించుకోవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.దోమ కాటు వల్ల వచ్చే దద్దుర్లను నివారించడంలో ఉల్లిపాయ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఉల్లిపాయల నుంచి రసం తీసుకోవాలి.ఆ రసాన్ని దద్దుర్లుపై అప్లై చేసి.
ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే దద్దుర్లు తగ్గు ముఖం పడతాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా దద్దుర్లకు చెక్ పెట్టవచ్చు.ఒక గిన్నెలో రెండు స్పూన్ల గోరు వెచ్చని నీరు తీసుకుని.
అందులో అర స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ వాటర్‌ను దద్దుర్లు ఉన్న చోట దూదితో అద్దాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.అలాగే కలబంద నుంచి గుజ్జు తీసుకుని.
దద్దుర్లు ఉన్న చోటు పూసి డ్రై అవ్వనివ్వాలి.ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కూడా దద్దుర్లు తగ్గుతాయి. """/"/
బేకింగ్ సోడా కూడా దోమ కాటు వల్ల వచ్చే దద్దుర్లను నివారిస్తుంది.
ఒక బౌల్‌లో కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని దద్దుర్లు ఉన్న చోట అప్లై చేసి.అర గంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా కూడా దద్దుర్లు మటు మాయం అవుతాయి.
పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయడానికి అదే కారణం.. ఆయనే డాన్సింగ్ కింగ్: శ్రీ లీల