అలసిపోయిన కళ్లకు అద్భుత చిట్కాలు!
TeluguStop.com
సాధారణంగా ఎక్కవ సమయం పాటు ఫోన్లు చూసినా.ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో వర్క్ చేసినా.
ఎక్కువ చదివినా.నిద్ర లేకపోయినా.
కళ్లు అలసటకు గురవుతుంటాయి.దాంతో కళ్లు మంటలు, ఎర్రగా మారడం, దురద లేదా ఇతరితర సమస్యలు ఎదురవుతుంటాయి.
అలా జరిగినప్పుడు ఏ పని చేయలేక డీలా పడిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ఫాలో అయితే.
అలసిపోయిన మీ కళ్లు మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేస్తాయి.మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్లు బాగా అలసిపోయినప్పుడు.ఐస్ ముక్కలను తీసుకుని ఒక కాటన్ క్లాత్‌తో చుట్టుకోవాలి.
ఇప్పుడు కాటన్ క్లాత్‌లో ఉన్న ఐస్ ముక్కలను కళ్లపై మెల్ల మెల్లగా అద్దుకుంటూ ఉండాలి.
ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు పాటు ఇలా చేయడం వల్ల కళ్లు చల్లబడి రిలాక్స్ అవుతాయి.
మరియు ఎర్రగా మారిన కళ్లు నార్మల్‌గా మారతాయి.ఇక సాధారణంగా చాలా మంది చేసే పొరపాటు టీ బ్యాగ్స్ యూజ్ చేసిన తర్వాత పడేస్తుంటారు.
అయితే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే టీ బ్యాగ్స్‌ను ఒక పది నిమిషాల పాటు ఫ్రీజర్ లో పెట్టి.
అనంతరం వాటిని కళ్లపై పెట్టుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల అలసిపోయిన కళ్లు మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వస్తాయి.
మరియు ఇలా చేయడం వల్ల కంటి దురద కూడా తగ్గుతుంది.రోజ్‌వాటర్ కూడా కంటి అలసటను దూరం చేయడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
ముందు రోజ్‌వాటర్‌ను కాటన్ బాల్ మీద వేసుకోవాలి.ఇప్పుడు కళ్లు మూసుకుని.
కాటన్ బాల్‌ను కళ్లపై పది నిమిషాల పాటు ఉంచుకోవచ్చు.ఇలా చేయడం వల్ల కళ్ల అలసట మాయమవుతుంది.
అదే సమయంలో కళ్లు మంట సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.ఇక ఈ టిప్స్‌తో పాటు ఆహారంలో విటమిన్ ఎ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలి.
అప్పుడే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పవన్ వల్ల సినిమాలకు దూరమవుతున్నాను…నటి నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!