ముఖ చ‌ర్మం బ్రైట్ అండ్ టైట్‌గా మారాలా? అయితే ఈ రెమెడీ మీకోస‌మే!

వయసు పెరిగే కొద్ది ముఖ చర్మం సాగిపోతూ ఉంటుంది.అలాగే చ‌ర్మం యొక్క నిగారింపు సైతం తగ్గుతూ వస్తుంది.

దీంతో యవ్వనాన్ని కాపాడుకోవడం కోసం ఖరీదైన క్రీములు, సీరమ్ లు వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ.

ఇప్పుడు చెప్పబోయే సూపర్ హోం రెమెడీ మాత్రం మీ ముఖాన్ని బ్రైట్ గా మరియు టైట్ గా మారుస్తుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాసు వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలను వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన మిశ్రమం నుంచి ప‌ల్చ‌టి వ‌స్త్రం స‌హాయంతో అవిసె గింజల జల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.

"""/"/ ఇప్పుడు మిక్సీ జార్‌ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజల జెల్, రెండు టేబుల్ స్పూన్లు ఉడికించిన అన్నం, వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన‌ అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే సాగిన ముఖ చర్మం టైట్ గా మారుతుంది.

ముఖంపై ఏమైనా ముడతలు ఉంటే క్రమంగా తగ్గు ముఖం పడతాయి.మరియు స్కిన్ వైట్ అండ్ బ్రైట్ గా సైతం మెరుస్తుంది.