ఐలాషెస్ ఒత్తుగా పెర‌గాలా? అయితే గ్రీన్ టీతో ఇలా చేయండి!

ఐలాషెస్ లేదా క‌నురెప్ప‌లు.ఒత్తుగా ఉంటే ముఖం రెట్టింపు అందంతో క‌నిపిస్తుంది.

కానీ, అంద‌రికీ ఐలాషస్ ఒత్తుగా ఉండ‌వు.ఒక‌వేళ ఉన్న అధికంగా స్మార్ట్ ఫోన్ల‌ను వినియోగించ‌డం, గంట‌లు త‌ర‌బ‌డి టీవీ చూడటం, ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, కెమిక‌ల్ ఎక్కువ‌గా ఉండే ఐ ప్రోడెక్ట్స్ వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఊడిపోతూ ఉంటాయి.

దాంతో చేసేదేమి లేక చాలా మంది కుత్రిమ ఐలాషెస్‌పై ఆధార ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను పాటిస్తే కుత్రిమ ఐలాషెస్‌తో ప‌నే ఉండ‌దు.

ఎందుకంటే, ఆ టిప్స్ ద్వారా మీ క‌నురెప్ప‌లు స‌హ‌జంగానే ఒత్తుగా పెరుగుతాయి.మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

గ్రీన్ టీ ఆరోగ్యంగా, ఫీట్‌గా ఉంటేందుకు ఎంతగానో స‌హాయ‌ప‌డుతుంది.అలాగే ఐలాషెస్‌ను ఒత్తుగా పెరిగేలా చేయ‌డంలోనూ గ్రీన్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అందు కోసం ఒక బౌల్ తీసుకుని అందులో చ‌ల్లారిన గ్రీన్ టీ రెండు స్పూన్లు, కొబ్బ‌రి నూనె ఒక స్పూన్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని కాటన్‌ ప్యాడ్ సాయంతో క‌నురెప్ప‌ల‌కు అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం కూల్ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే ఐలాషెస్ ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతాయి.

"""/"/ అలాగే ఎగ్ వైట్‌తోనూ ఐలాషెస్‌ను ఒత్తుగా పెంచుకోవ‌చ్చు.బౌల్‌లో ఒక ఎగ్ వైట్, అర స్పూన్ గ్లిజరిన్‌ను తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ను రెప్ప‌ల‌కు పూసి.పావు గంట పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం వాట‌ర్‌తో శుభ్రంగా చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

పైన చెప్పుకున్న టిప్స్‌ను పాటించ‌డ‌మే కాదు.కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మస్కారా, ఐలైనర్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

కళ్లను ప‌దే ప‌దే నలుపుకొనే అలవాటు ఉంటే మానుకోవాలి.ఇక కొంద‌రు ఐలాషెస్‌ను కర్లింగ్ చేస్తూ ఉంటారు.

ఇలా చేస్తే క‌నురెప్ప‌లు ఎక్కువ‌గా రాలిపోతుంటాయి.అందుకే అందం కోసం అలా ఎప్పుడూ చేయ‌రాదు.

సౌత్ ఆఫ్రికన్ బిర్యానీ ఇండియన్ బిర్యానీ కంటే రుచిగా ఉంటుందా..?