ప్రతి అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటుంది.అలాగే అందమైన ముఖంతో పాటు
అందమైన చేతులు కూడా ఉండాలని కోరుకుంటుంది.
ఆలా ఉండటానికి ఎంత ఖర్చు
పెట్టటానికి అయినా వెనుకాడరు.అయితే ఖరీదైన కాస్మొటిక్స్ వాడిన ఒక్కోసారి
ఫలితం రాకపోగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే మనకు
అందుబాటులో ఉండే వస్తువులతో సమర్ధవంతంగా మోచేతుల నలుపును
తగ్గించుకోవచ్చు.ముఖం అందంగా ఉన్న మోచేతులు నల్లగా ఉన్నాయంటే కాస్త
అసహ్యంగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఆ చిట్కాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఒక స్పూన్ బియ్యం పిండిలో మూడు స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా కలిపి
పేస్ట్ గా తయారుచేయాలి.
ఈపేస్ట్ ని మోచేతులపై రాసి బాగా ఆరిన తర్వాత
గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీం
రాయాలి.ఈ విధంగా రోజుకి రెండు నుంచి మూడు సార్లు చేస్తూ ఉంటె మంచి ఫలితం
కనపడుతుంది.
!--nextpage
తాజా బంగాళాదుంపను తీసుకోని జ్యుస్ చేయాలి.ఈ జ్యుస్ ని మోచేతులపై రాశి
20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా రోజులో
రెండు సార్లు చేయాలి.అరస్పూన్ బేకింగ్ సోడాలో ఒక స్పూన్ డిస్టిల్డ్ వాటర్ కలిపి పేస్ట్ గా
తయారుచేయాలి.
ఈ పేస్ట్ ని నల్లగా మారిన మోచేతులపై రాస్తే మంచి ఫలితం
ఉంటుంది.తాజా పెరుగును నల్లగా ఉన్న మోచేతులపై రాసి 20 నిముషాలు తర్వాత
గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా రోజులో మూడు నుంచి
నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆమేనా కారణమా?