చ‌లికాలంలో ద‌గ్గు ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? అయితే ఈ చిట్కాలు మీకోస‌మే!

చలికాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మందిని కలవరపెట్టే కామన్ సమస్యల్లో దగ్గు ఒకటి.

వాతావరణంలో వచ్చే మార్పులు దగ్గుకు ప్రధాన కారణం.అయితే దగ్గు చిన్న సమస్య గానే కనిపించిన తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది.

ముఖ్యంగా రాత్రుళ్ళు దగ్గు కారణంగా నిద్ర కూడా సరిగ్గా పట్టదు.ఈ క్రమంలోనే దగ్గును నివారించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే సులభంగా దగ్గును వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ ను పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు తమలపాకులు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

నీరు సగం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాట‌ర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను కలిపి సేవించాలి.రోజుకు రెండు సార్లు ఈ డ్రింక్‌ ను తీసుకుంటే దగ్గు దెబ్బకు పరార్ అవుతుంది.

జలుబు సమస్య నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. """/"/ అలాగే ముల్లంగి దగ్గు ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

రెండు లేదా మూడు ముల్లంగి స్లైసెస్ ని తీసుకుని తేనెలో ముంచి తినాలి.

ఇలా రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు చేసినా దగ్గు నుండి ఉపశమనాన్ని పొందొచ్చు.

ఇక ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్లు తులసి ఆకుల రసం కలిపి సేవించాలి.

ఈ డ్రింక్ ను తీసుకుంటే గ‌నుక ఉక్కిరి బిక్కిరి చేసే దగ్గు సమస్య దూరం అవుతుంది.

చిరంజీవితో చేయాల్సిన సినిమాను వెంకటేష్ తో చేయబోతున్న స్టార్ డైరెక్టర్…