పాదాల‌ను తెల్ల‌గా, అందంగా మార్చే సింపుల్ టిప్స్‌!

పాదాలు అందంగా, తెల్ల‌గా, మృదువుగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.ఎందుకంటే.

శ‌రీరంలో బ‌య‌ట‌కు క‌నిపించే భాగాల్లో పాదాలు కూడా ఒక‌టి.అందుకే పాదాలు ఆక‌ర్షించేలా క‌నిపించాల‌ని అనుకుంటారు.

కానీ, చాలా మంది చేసే పొర‌పాటు ముఖంపై పెట్టే శ్ర‌ద్ధ పాదాల‌పై పెట్ట‌రు.

అందుకే కొంద‌రి పాదాలు కాస్త అంద‌హీనంగా మార‌తాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.

ఖ‌చ్చితంగా మీ పాదాలు తెల్ల‌గా, అందంగా మార‌తాయి.మ‌రి లేట్ చేయ‌కుండా ఈ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో కొద్దిగా శెన‌గ‌పిండి, ప‌సుపు, నిమ్మ‌ర‌సం వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేసి.బాగా ర‌ద్దుకోవాలి.

ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో పాదాల‌ను క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల పాదాలు తెల్ల‌గా మార‌తాయి.రెండొవ‌ది.

ఒక బౌల్‌లో కొద్దిగా కాఫీ పౌడ‌ర్‌, వైట్ టూత్ పేస్ట్‌, నిమ్మర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేసి.ఐదు నిమిషాల పాటు మెల్ల‌గా స్క్ర‌బ్ చేయాలి.

ఆ త‌ర్వాత పావు గంట పాటు ఆర‌నిచ్చి.గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాలు అందంగా, మృదువుగా మార‌తాయి.మూడొవ‌ది.

ఒక బౌల్‌లో బియ్యం పిండి, సాల్ట్ మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేసి.కాసేపు స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి.

అనంత‌రం ప‌ది నిమిషాలు ఆర‌నిచ్చి.చల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా పాదాలు తెల్ల‌గా, అందంగా మార‌తాయి.అలాగే ప్ర‌తి రోజు నిద్రించే ముందు ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని పాదాల‌కు మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాలు మృదువుగా మార‌తాయి.

భారతీయుల రక్తంతో తడిసిన ఉక్రెయిన్.. రష్యా తరపున పోరాడుతూ 12 మంది ఇండియన్స్ దుర్మరణం!