వ‌ర్షాకాలంలో వేధించే అతిసారం..ఈ చిట్కాల‌తో చెక్ పెట్టండిలా!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే.

ఈ సీజ‌న్‌లో అనేక జ‌బ్బులు వేధిస్తుంటాయి.అలాంటి వాటిలో అతిసారం ఒక‌టి.

దీనినే లూజ్ మోష‌న్స్ అని కూడా అంటారు.ముఖ్యంగా పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది.

వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరిగి పోవ‌డం, తాగు నీరు కలుషితం కావడం, బ్యాక్టీరియా, వైర‌స్, తీసుకునే ఆహారాల‌పై ఈగ‌లు ముస‌ర‌డం, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు నెమ్మ‌దించ‌డం, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉండ‌టం.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అతిసార స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు.ఈ అతిసారం కార‌ణంగా.

శరీరంలోని నీరు, లవణాలన్నీ బయటకు వెళ్లి పోతాయి.దాంతో డీహైడ్రేషన్‌కు గుర‌వ‌డంతో పాటు నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు తీవ్రంగా వేధిస్తుంటాయి.

అయితే అటువంటి స‌మ‌యంలో కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటిస్తే.సులభంగా అతిసారం దూరం అవుతుంది.

మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి. """/" / అతిసార స‌మ‌స్య‌ను నివారించ‌డంలో మున‌గాకు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఫ్రెష్‌గా ఉండే గుప్పెడు మున‌గాకును తీసుకుని.నూరి ర‌సం తీసుకోవాలి.

ఈ ర‌సంలో ఒక స్పూన్ తేనె క‌లిపి సేవించాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే ఒక గ్లాస్ ప‌ల్చ‌టి మ‌జ్జిగ‌లో ఒక స్పూన్ అల్లం ర‌సం క‌లిపి తీసుకోవాలి.

ఇలా రోజులో ఒక‌టి, రెండు సార్లు తీసుకుంటే.లూజ్ మోష‌న్స్ త‌గ్గుతాయి.

దానిమ్మ తొక్క‌లతో కూడా అతిసార స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.ఎండ‌బెట్టిన దానిమ్మ తొక్క‌లును మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇప్ప‌డు ఒక గ్లాస్ వాట‌ర్‌లో ఒక స్పూన్ దానిమ్మ తొక్క‌ల పొడి క‌లిపి బాగా మ‌రిగించి.

వ‌డ‌బోసి తీసుకోవాలి. """/" / ఇక ఒక గ్లాస్ వాట‌ర్‌లో అర స్పూన్ చ‌ప్పున జీల‌క‌ర్ర పొడి, వాము పొడి వేసి హీట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత వ‌డ‌బోసుకుని.గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?