ఈ మంత్రి మాస్కు చూస్తే వామ్మో అంటారు..!

ఇటీవల కాలంలో మాస్కులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

మొన్నటికి మొన్న ఒకరు గోల్డ్ మాస్కు అంటూ వచ్చారు.ఆతర్వాత వజ్రాల మాస్క్ అంటూ వచ్చారు.

నిన్నటికి నిన్న ఏకంగా కోట్ల రూపాయిల మాస్కు చేయించుకొని అది వైరల్ చేశారు.

కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న మాస్క్ బంగారం, వజ్రాలతో చెయ్యలేదు.కేవలం క్లాత్ తో చేసారు.

కానీ వైరల్ అవుతుంది.ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

సాధారణంగా ఆడవాళ్లు మాస్కులను వారి దుస్తుల రంగులకు మ్యాచ్ అయ్యేలా చేయించుకుంటున్నారు.కొందరు అయితే మాస్క్ వేసుకున్న వారి ఫేస్ కనిపించాలని మాస్క్ పైనే వారి ముఖాన్ని వేస్తున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా తన ముఖానికి సరిపోయేలా ముక్కు, మీసాలు, పెదవులు సరిగ్గా అతికేలా ఉండేలా మాస్కులను తయారుచేయించారు.

మాస్కు రంగు అతని చర్మ రంగులో ఉండేలా చూసుకున్నాడు.ఇంకేముంది అతను మాస్కు పెట్టుకున్న పెట్టుకోనట్టే కనిపిస్తుంది.

ఎక్కడికి వెళ్లి అతనికంటే కూడా అతని మాస్కులు ఎక్కువ వైరల్ అవుతున్నాయి.మీరు ఓసారి ఆ మాస్కుల ఫోటోలు చూసేయండి.

అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ల పరిస్థితి ఏంటి..?