తిరుమల చేరుకున్న అమిత్ షా…!!

నేటితో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈసారి ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జాతీయ పార్టీలు భారీ ఎత్తున ప్రచారాలలో పాల్గొనడం జరిగింది.

ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు ముగిశాయి.

జూన్ ఒకటవ తారీఖు నాడు చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి.జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.

మూడోసారి కచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించాలని ఎన్డీఏ కంకణం కట్టుకుంది.దీంతో బీజేపీ( BJP ) పెద్దలు ప్రధాని మోదీ( PM Modi ) కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

( Amit Shah ) అనేక ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. """/" / మోదీ ఏకంగా 200కు పైగానే భారీ బహిరంగ సభలలో పాల్గొన్నారు.

80 ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికలను జాతీయ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికల ప్రచారం నేటితో ముగియడంతో శ్రీవారి దర్శనార్థం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుమల( Tirumala ) వచ్చారు.

తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట చేరుకున్నారు.అక్కడ ఆయనకు ఎన్డీఏ కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు.

కాగా ఇవాళ రాత్రి అమిత్ షా తిరుమలలోనే బస చేయనున్నారు.రేపు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.

అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

సీఎం పదవి పై మనసులో కోరిక బయటపెట్టిన పవన్.. ఏమన్నారోతెలుసా?