ఈ కిటుకులతో హోమ్ లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చు..

కొన్ని నెలల నుంచి వడ్డీ రేట్లు పెరుగుతున్న వేళ లోన్ ఈఎంఐల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది.

దీనివల్ల హోమ్ లోన్స్ మరింత భారంగా మారుతున్నాయి.ఈ క్రమంలో హోమ్ లోన్ భారాన్ని తగ్గించే కొన్ని కిటుకులను ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.• ప్రీ-ఈఎంఐ: హోమ్ లోన్ పొందకముందే బ్యాంక్‌లకు వడ్డీ కట్టడాన్నే ప్రీ-ఈఎంఐ అంటారు.

లోన్ భారం తగ్గించుకోవడానికి ప్రీ-ఈఎంఐ హెల్ప్ అవుతుంది.అయితే లోన్ డిస్‌బర్స్ కావడం లేటైతే మీరు కేవలం వడ్డీ కట్టడంలోనే ఉండిపోతారు.

లోన్ వచ్చాక అసలైన ఈఎంఐ అంటే ప్రిన్సిపాల్ లోన్ అమౌంట్ + వడ్డీ కట్టడం భారంగా మారుతుంది.

అందుకే ముందే వడ్డీ కట్టనక్కర్లేదు.• ఈఎంఐ రివ్యూ: హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు ఆర్‌బీఐ పాలసీ రేట్లు మారిన ప్రతిసారీ మారుతుంటుంది.

దీనివల్ల లోన్ టైమ్, ఈఎంఐ మారే ఛాన్స్ ఉంది.ఈ విషయాన్ని ప్రతి 3 నెలలకోసారి చెక్ చేసుకోవడం ద్వారా అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

"""/"/ • వీలైనంత త్వరగా కట్టేయాలి: హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ మీరు కట్టగలిగే దానికి అనుగుణంగా ఉండొచ్చు.

అయితే కొంతకాలం తర్వాత మీ జీతం పెరగడం వల్ల ఆ ఈఎంఐ కంటే ఎక్కువ కట్టగల శక్తి మీకు ఉంటుంది.

అలాంటప్పుడు ఎక్కువగా డబ్బులు కట్టడం ద్వారా త్వరగా హోమ్ లోన్ తీర్చేయవచ్చు.అలాగే బోనస్‌లను ఈ అప్పు తీర్చడానికి వాడితే రుణకాలం తగ్గుతుంది.

బ్యాంకులను కూడా రుణకాలం తగ్గించాలని అడగాలి.లోన్ వ్యవధి తగ్గితే ఆటోమేటిక్‌గా కట్టే వడ్డీ కూడా తగ్గుతుంది.

"""/"/ • ప్రీమెచ్యూర్ లోన్ క్లోజ్‌: లోన్‌ను ప్రీమెచ్యూర్ గా క్లోజ్‌ చేయడానికి బదులుగా.

ఆ డబ్బును ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు.ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ లోన్‌కు కట్టే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.