Salaar : హాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్న సలార్.. అదంతా నెట్ ఫ్లిక్స్ ఎఫెక్ట్ వల్లే అంటూ!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, శ్రీయా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్ టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు తదితరులు నటించిన విషయం తెలిసిందే.

గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టిన విషయం తెలిసిందే.

వెయ్యి కోట్లు రాబట్టే సత్తా ఉన్నా బాలీవుడ్‌ లో ఎలాంటి ప్రమోషన్స్‌ చేయకపోవడంతో ఆ మార్క్‌ను రీచ్‌ కాలేకపోయింది.

"""/" / అంతే కాకుండా డంకీ సినిమాకు కార్పొరేట్‌ బుకింగ్స్‌ జరగడం.సలార్‌( Salaar )కు బాలీవుడ్‌లో పెద్దగా స్క్రీన్స్‌ ఇవ్వకపోవడం వంటివి జరగడంతో కలెక్షన్స్‌ పై కొంత మేర ప్రభావం పడింది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సలార్‌ కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇప్పుడు నార్త్‌లో టాప్‌-1లో దూసుకుపోతోంది.టాలీవుడ్‌ నుంచి మొదలైన ప్రభాస్‌ దండయాత్ర పాన్‌ ఇండియా దాటి హాలీవుడ్‌ లో అడుగుపడింది.

జనవరి 20 నుంచి ఓటీటీ లో రన్‌ అవుతున్న సలార్‌ గ్లోబల్​​ ఆడియన్స్‌ కు దగ్గరైంది.

"""/" / నెట్‌ఫ్లిక్స్‌( Netflix )కు భారత్‌లో కంటే ఫారిన్‌ దేశాల్లోనే సబ్‌స్క్రైబర్స్‌ ఎక్కువ దీంతో వారిలో సలార్‌ను చూసి బాగుంది, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, తమిళ్‌, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్‌లో క్రేజ్ దక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమాను చూసిన అక్కడి ప్రేక్షకులు సలార్‌ సూపర్‌ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఇండియన్‌ భాషల్లోనే వారు చూసి ఇలాంటి కామెంట్లు చేస్తే ఇక ఇంగ్లీష్‌ వర్షన్‌ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ప్రభాస్‌ కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది.

అలా సలార్ మూవీ ప్రస్తుతం హాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తోంది.

మహేష్ బాబు జక్కన్న సినిమాలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్.. ఆ హీరో చాలా లక్కీ అంటూ?