Suma Kanakala : గుడ్లు, టమోటాలతో హోలీ జరుపుకున్న సుమ.. ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు అంటున్న ఫాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సుమ కనకాల( Suma Kanakala ) ఒకరు.

ఈమె గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా( Star Anchor ) దూసుకుపోతున్నారు.

ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని వీడియోలను ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే నేడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా హోలీ( Holi ) పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సుమ కూడా హోలీ పండుగను జరుపుకున్నారు. """/" / ఈ క్రమంలోనే సుమ తన హోలీ పండుగకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఏది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా సుమ మేడ పైనుంచి కింద వీధిలో వెళుతూ ఉన్న వారిని చూసి పైనుంచి టమోటాలు కోడిగుడ్లు నీటిని కిందికి విసురుతూ దాక్కొని ఉంటుంది.

అయితే కొద్దిసేపటికి ఆ టమోటాలు( Tomatoes ) వారిపై పడ్డాయో లేదో అని తిరిగి చూడగా డబల్ యాక్షన్ లో కింద ఉన్న సుమ ఆ టమోటాలు కోడిగుడ్లు అన్నిటిని ఒక బుట్టలో క్యాచ్ పట్టుకొని ఉంటుంది అలాగే వాటర్ అన్నీ కూడా ఒక బకెట్లోకి పట్టుకొని ఉంటుంది.

"""/" / ఇలా కింద ఉన్నటువంటి సుమ థాంక్యూ సో మచ్ మేడం ఎగ్ ఫర్ బ్రేక్ ఫాస్ట్, టమోటో దాల్, వాటర్ ఫర్ బాత్ అంటూ హ్యాపీ హోలీ( Happy Holi ) అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది దీంతో పైన మేడపై ఉన్నటువంటి సుమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఇక ఈ వీడియోను సుమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ హోలీ సేవ్ ద వాటర్ అంటూ ఈ వీడియోని షేర్ చేయగా ఒకసారిగా ఇది వైరల్ గా మారింది.

ఇది చూసినటు వంటిఎంతో మంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. """/" / పైనుంచి గుడ్లు విసిరితే పగల్లేదేంటి సుమక్క అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరి కొందరు కనీసం చెప్పులైన మార్చొచ్చు కదా సుమక్క అంటూ కామెంట్ పెడుతున్నారు.

ఇక కొంతమంది నేటిజన్స్ ఇలాంటి ఐడియాలు మీకు తప్ప మరెవరికి రావు కదా సో ఫన్నీ అంటూ వివిధ రకాలుగా ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి సుమ సోషల్ మీడియాలో కూడా అభిమానులను ఎప్పుడు డిసప్పాయింట్ చేయకుండా సరదాగా అందరిని నవ్విస్తూ ఉంటారని చెప్పాలి.

95 రోజులు సముద్రంలో నరకం చూసిన మత్స్యకారుడు.. ఏం తిన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!