భీష్మతో పోటీ పడుతున్న ఫలక్ నుమా దాస్...

భీష్మతో పోటీ పడుతున్న ఫలక్ నుమా దాస్…

ఫలక్ నుమా దాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైనటువంటి విశ్వక్ సేన్ తాజాగా ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన  హిట్ చిత్రంలో నటించాడు.

భీష్మతో పోటీ పడుతున్న ఫలక్ నుమా దాస్…

ఈ చిత్రం యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

భీష్మతో పోటీ పడుతున్న ఫలక్ నుమా దాస్…

అంతేగాక విడుదలైన రెండు రోజులకే దాదాపుగా 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

అంతేకాక నైజాం సెంటర్లో మంచి పట్టు కలిగి ఉన్నటువంటి విశ్వక్ సేన్ కలెక్షన్ల పరంగా తన సత్తా ఏంటో చూపించాడు.

ఈ చిత్రంతో ఎన్ని రోజులు హిట్ లేక ఇబ్బంది పడుతున్న విశ్వక్ సేన్ కి హిట్ మంచి విజయం సాధించి ఊపిరి పోసినట్లయింది.

అయితే గత వారంలో విడుదలైనటువంటి భీష్మ చిత్రం కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా నితిన్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రం కూడా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం గా ఉండటంతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

అంతేగాక నితిన్ కూడా ఈ చిత్రం విడుదలైనటువంటి వారం రోజుల్లోనే దాదాపుగా 50 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీసు వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

"""/"/ అయితే ప్రస్తుతం థియేటర్లలో ఈ రెండు చిత్రాలు నువ్వానేనా అన్నట్లు గా వసూళ్ళ పరంగా పోటీ పడుతున్నాయి.

అంతేగాక బాక్సాఫీస్ వద్ద  చెప్పుకోదగ్గ చిత్రాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు దర్శక దర్శక నిర్మాతలకి ఓ రకంగా కాసుల పంట పండిస్తోంది అని చెప్పవచ్చు.

ఆ విధంగా ఫలక్నామా దాస్ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో కలెక్షన్ల విషయంలో పోటీ పడుతున్నాడు.

ఎవరు గెలిచారన్నది తెలియాలంటే ఈ వారాంతం వరకు వేచి చూడాల్సిందే.

ఇదేందయ్యా ఇది.. కొబ్బరి బొండం టీ అంటా.. మీరేమైనా తాగారా? వైరల్ వీడియో

ఇదేందయ్యా ఇది.. కొబ్బరి బొండం టీ అంటా.. మీరేమైనా తాగారా? వైరల్ వీడియో