మహాభారతం ప్రాజెక్ట్ లో న్యాచురల్ స్టార్ నాని.. జక్కన్నతో పని చేసిన హీరోలంతా కనిపిస్తారా?

శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3( Hit3 ).

ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.హిట్ సినిమా ఫ్రాంచైజీ లో భాగంగా రూపొందిన ఈ సినిమా మే 1న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మూవీ మేకర్స్.

ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ( Star Director Rajamouli )ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇందులో మూవీ కాన్సెప్టుకు తగ్గట్టు యాంకర్‌ సుమ.నాని, రాజమౌళిలను ఇంటరాగేట్‌ చేశారు.

మీరు తెరకెక్కించనున్న మహాభారతం సినిమాలో ( Mahabharatam )నాని పాత్ర ఫిక్స్‌ అయిందంటూ వార్తలు వచ్చాయి.

నిజమేనా? అని అడగ్గా.తప్పకుండా ఆ ప్రాజెక్టులో నాని ఉంటాడనేది ఫిక్స్‌ అని రాజమౌళి తెలిపారు.

క్యారెక్టర్‌ గురించి మాత్రం ప్రస్తావించలేదు.ఎస్‌ఎస్‌ఎంబీ 29 ( SSMB 29 )గురించి ఏదైనా అప్‌డేట్‌ ఇవ్వమని కోరగా నవ్వి ఊరుకున్నారు.

కాగా మహాభారతం రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే.టీజర్‌, ట్రైలర్‌ చూసి ఈ సినిమాలో ఎక్కువగా వయలెన్స్‌ ఉందని అనుకుంటున్నారు.

కానీ, అది మిమ్మల్ని ఎంజాయ్‌ చేసేలా చేస్తుంది.థ్రిల్లర్‌ జానర్‌ కు కమర్షియల్‌ హంగులు జోడిస్తే ఎలా ఉంటుందో అదే హిట్‌ 3 అని నాని ఆసక్తి రేకెత్తించారు.

"""/" / ఈ సందర్భంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే హిట్ 3 సినిమా విషయానికి వస్తే.ఈ సినిమాలో నాని హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుందని నానితో పాటు మూవీ మేకర్స్ కూడా భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు.మరి మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.