హిందీలో హిట్ 2.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను డైరక్షన్ లో తెరకెక్కిన హిట్ 2 శుక్రవారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.

క్రైం థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ మూవీ మంచి ఎంటర్టైనర్ అని అంటున్నారు.

ముఖ్యంగా శైలేష్ డైరక్షన్ టాలెంట్ ని అందరు మెచ్చుకుంటున్నారు.అడివి శేష్ నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయట.

ఇప్పటికే తన లాస్ట్ మూవీ మేజర్ తో అడివి శేష్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇప్పుడు హిట్ 2ని కూడా అక్కడకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.హిట్ 2 ఒకేసారి హిందీలో కూడా రిలీజ్ కాలేదు.

దానికి తగిన ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్.ఢిల్లీ, ముంబైలలో ప్రమోషన్స్ చేసిన్ డిసెంబర్ 30న హిట్ 2 ని రిలీజ ప్లాన్ చేస్తున్నారు.

పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే హిట్ 2 హిందీ రిలీజ్ ఉంటుందని టాక్.మేజర్ తర్వాత హిందీలో అడివి శేష్ ఈ మూవీతో సత్తా చాటనున్నాడు.

బాలీవుడ్ ఆడియన్స్ అసలే థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.వారికి సరిగా కనెక్ట్ అయితే మాత్రం హిట్ 2 మరో సంచలనం సృష్టించే ఛాన్స్ ఉంది.

Chiranjeevi : నాగబాబు విషయం లో చిరంజీవి ని హేళన చేసిన ఇండస్ట్రీ పెద్దలు…