సీఎం రేవంత్ రెడ్డిది మాట తప్పిన చరిత్ర..: హరీశ్ రావు
TeluguStop.com
ఆరు గ్యారెంటీలపై బాండ్ పేపర్లపై కాంగ్రెస్ నేతలు రాసిచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) అన్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిది మాట తప్పిన చరిత్రని విమర్శించారు.గతంలో కొడంగల్( Kodangal ) లో ఓడిపోతే రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట తప్పారన్న విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.
తనకు పదవి కంటే ప్రజలకు మేలు జరగడమే ముఖ్యమని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేశామని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.
ప్రధాన హామీలను పక్కన పెట్టారన్న హరీశ్ రావు ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యతని స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.