శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర గురించి మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ తిరువనంతపురంలోని పజవంగాడి వద్ద తూర్పు కోటలో ఉంది.

భాగవతం ప్రకారం బలరాముడు సందర్శించిన పురాతన నిర్మాణం అయిన శ్రీ విష్ణు ఆలయం ఇది.

పురాతన గ్రంథాల ప్రకారం ఈ ఆలయం యొక్క నిర్మాణం 5000 సంవత్సరాల క్రితం నిర్మించబడినది చెబుతారు.

కాని దీనికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు.ఈ ఆలయ సమీపంలో పద్మ తీర్థం అనే పవిత్ర ట్యాంకు ఉంది.

ఈ ఆలయం ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా పేర్కొనబడింది.అనార్థ దేశం వద్ద దివాకర ముని అని పిలవబడే గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు.

ఒకరోజు ఆ ముని తన ఆశ్రమం వద్ద చిన్న పిల్లాడిని చూసి ముగ్ధుడై పోయాడు.

అయితే ఆ బాలుడు దగ్గరకు వెళ్లి తన దగ్గర ఉండాలని కోరాడు.అయితే తనని ఎప్పుడు అవమానించ కూడదు అనే షరతుతో బాలుడు అంగీకరిస్తాడు.

కానీ ఆ ముని ఆ బాలుడు పిల్లతనం చర్యలతో సహనంగా భరించేవాడు. """/" / ఒకరోజు ముని పూజలు చేస్తుండగా తన వస్తు సామాగ్రిని తీసుకొని నోటిలో ఉంచుకొని అపవిత్రం చేస్తాడు.

ఆ సమయంలో కోపోద్రిక్తుడైన ముని ఆ బాలుడిని తక్షణమే అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని శిక్షిస్తాడు.

అయితే అక్కడి నుంచి వెళ్లేటప్పుడు బాలుడు ముని కలవాలి అనుకుంటే అనంత కాడకు రమ్మని చెబుతాడు.

అయితే కొంతకాలం తర్వాత ముని ఆ బాలుడిని విష్ణువు అని గ్రహించి తన దర్శనార్థం అనంత కాడికి వెళ్తాడు.

అప్పటికే ఆ బాలుడు ఇలుప్ప చెట్టు లో విలీనం అవుతాడు.అయితే ఆ చెట్టు కింద పడి ఒక పెద్ద విష్ణువు విగ్రహంలా ఉద్భవిస్తుంది.

విగ్రహం తల తూర్పు కోట నుండి మూడు మైళ్ళ దూరంలో ఉన్న తిరువల్లం వద్ద ఉంది.

కాళ్లు ట్రీప్పాపూర్ వద్ద ఉన్నాయి.అయితే విగ్రహాన్ని 18 అడుగుల కుదించిన ముని తనను చూడగలిగే పరిమాణంలో కుదించమని విష్ణువును ప్రార్థిస్తాడు.

అనంత పద్మనాభ స్వామి యొక్క ప్రధాన విగ్రహం ఆలయం యొక్క గర్భగుడిలో ఉంది.

ఇక్కడ విష్ణువు శేషనాగుపై పడుకొని శివ లింగంపై తన కుడిచేతిని అలాగే ఎడమచేతిలో కమలము కలిగి ఉన్నాడు.

ఈ విగ్రహం 18 అడుగుల పొడవు ఉండడం వల్ల మూడు తలపుల ద్వారా చూడవచ్చు.

మొదటి తలుపులో తల, చాతి రెండవ తలుపు ద్వారా చేతులు మూడవ తలుపు ద్వారా అడుగులు.

శ్రీ వారి ఈ భంగిమను అనంత శయనం అని పిలుస్తారు.అంటే యోగి నిద్ర అని అర్థం.

చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు..: జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు