కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేశారంటే నరఘోష శత్రు బాధలు తొలగిపోతాయని తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఏడాది కార్తీక మాసంలో( Karthika Masam ) కార్తిక పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనదని దాదాపు చాలా మందికి తెలుసు.

ఈ రోజు శైవ దేవాలయాలలో సాయంత్రం వేళ జ్వాలాతోరణం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో భక్తులు అంతా పాల్గొనాలని పండితులు చెబుతున్నారు.

అసలు ఈ జ్వాలాతోరణం ఏంటి? దీన్ని ఎందుకు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి పరమేశ్వరుడు( Parameshwara ) త్రిపురసురలను చంపేందుకు వెళ్తాడు.

అలా వెళ్ళినా పరమ శివుడు ఎంతటికి తిరిగిరాడు.దాంతో ఆయన కోసం ఎదురు చూసి ఆవేదన చెందిన పార్వతి దేవి( Parvati Devi ) జ్వాల ను ఏర్పాటు చేసి అందులో దూకాలని అనుకుంటుంది.

"""/" / సరిగ్గా ఆమె దూకే సమయంలో త్రిపురాసులను చంపేసి శివుడు తిరిగి వస్తాడు.

దాంతో ఆమె అగ్నిలోకి దుకాకుండా ఆగిపోతుంది.ఆమె రగిలించిన అగ్నిని పరమేశ్వరుడు తోరణంలా చేస్తాడు.

ఆ తర్వాత పార్వతి పరమేశ్వరులు ఆ జ్వాలా తోరణం చుట్టూ మూడు సార్లు ప్రదక్షణ చేస్తారు.

ఇలా జ్వాలా తోరణం ప్రత్యేకమైనదిగా నిలిచింది.అలాగే కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) రోజు శివుడి ఆలయాలలో స్తంభాలకు భక్తులు గడ్డితో తోరణాలు ఏర్పాటు చేస్తారు.

అలాగే వాటికి నూనెలో ముంచిన వస్త్రాలను తగిలించి వెలిగిస్తారు. """/" / భక్తులు ఎవరైతే జ్వాలాతోరణాన్ని ( Jwala Thoranam ) దర్శించుకుని దాని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారో వారికి నర దృష్టి, దోషం, శత్రు బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే సంవత్సరం అంతా దీపం వెలిగించక పోయినా పర్వాలేదు కానీ ఈ రోజు మాత్రం కచ్చితంగా 365 వత్తుల దీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల వెలిగించిన వారి కుటుంబ సభ్యులకి ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

స్థలాల స్కాం పై ప్రభుత్వం ఫోకస్ .. వైసీపీకి చిక్కులు తప్పవా ?