ఇది ద్వేషం పెంచే దేశం కాదు- ప్రేమను పంచే దేశం! రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర( Bharat Jodo Yatra ) సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ తిరిగిన తనకు అర్థమైనది ఏంటంటే ఆర్ఎస్ఎస్ భాజపా లు ప్రజల మధ్యలో ఎలా విద్వేషాలు పెంచుతున్నాయో గమనించానని, ఇది ద్వేషాన్ని పెంచే దేశం కాదని ప్రేమను పంచే దేశమని ,విద్వేష రాజకీయాలు చేసే వారికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) సందర్భంగా వరంగల్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలకు కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలు లోపే తొలి మంత్రివర్గంలోనే వాటిని ఆమోదించి అమలు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / భారతీయ రాష్ట్ర సమితి మరియు భాజపా స్వాభావికంగా ఒకే కోవకు చెందిన పార్టీలని, ఈ రెండు పార్టీలు పార్లమెంట్లో కూడా సహకరించుకోవడం తాను గమనించానని, భాజపా ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బారాస మద్దతు తెలిపిందని, ఒకరు తెలంగాణలో పని చేస్తుంటే మరొకరు ఢిల్లీలో పని చేస్తున్నారని ఇద్దరినీ ఓడించడం కాంగ్రెస్ లక్ష్యం అంటూ ఆయన వాఖ్యానించారు .

"""/" / ప్రధానమంత్రి మోడీ( Narendra Modi ) తన ప్రియమిత్రుడు అదానికి సహాయం చేస్తూ ఉంటే కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు సహాయం చేస్తారని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద ప్రజలకు సహాయం చేస్తుందంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్రంలో అణగారిన వర్గాలకు, దళితులకు తగిన న్యాయం దొరుకుతుందని తాము ఆశించామని అయితే భారతీయ రాష్ట్ర సమితి పరిపాలన వల్ల ఇవేమీ నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టి అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన వర్గాలను గుర్తించి బడ్జెట్ లో ఆయా వర్గాలకు నిదులు కేటాయించి తగిన న్యాయం చేస్తామని అలాగే అధికారానికి దూరం గా ఉండిపోయిన వర్గాలను కూడా అదికారం లో బాగస్వాములను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. షాకింగ్ వీడియో వైరల్..