అయ్యో పాపం బాలయ్య ? ఇరుక్కు పోయారా ?

తనను నమ్ముకున్న వారికి అండగా నిలబడుతూ, వారి కష్ట నష్టాలు తోడునీడగా గెలిచే వాడే నిజమైన నాయకుడు.

ఇప్పుడు నిజంగా కష్టకాలమే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

మార్చి 25 నుంచిh3 Class=subheader-style లాక్ డౌన్/h3p కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారికి కావలసిన అన్ని అవసరాలను తీరుస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అందిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.

ఏపీలో ప్రజాప్రతినిధులంతా ఈ విధంగా ప్రజల బాగోగులు చూస్తూ ఉంటే, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.

లాక్ డౌన్ వలన హైదరాబాదుకే పరిమితం అయిపోయాడు.కరోనా విజృంభిస్తున్న సమయంలో తన నియోజకవర్గానికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది.

తన సొంత నిధులను తెచ్చి ఈ కరోనా విపత్తు సమయంలో ఖర్చు పెడుతున్నా, ఆయన ప్రత్యక్షంగా నియోజకవర్గంలో లేకపోవడంతో ఆయన పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గాలకు పరిమితమయ్యారు.మంత్రులు సంగతి పక్కన పెడితే మిగతా అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులంతా ప్రజాక్షేత్రంలో గడుపుతూ వారికి ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో సౌకర్యాలు, మున్సిపల్ , పంచాయతీ అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయించడం, వీధులను శుభ్రం చేయించడం వంటివి చేస్తున్నారు.

ఇక రేషన్, ప్రభుత్వ పంపిణీ చేసే సహాయం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.అయితే అటువంటి అవకాశం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు లేకుండా పోయింది.

"""/"/ వాస్తవంగానే బాలకృష్ణ నియోజకవర్గానికి పెద్దగా రారు.ఎక్కువగా హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతుంటారు.

దాదాపు హిందూపురం నియోజకవర్గం కొన్ని నెలలుగా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు.గత టీడీపీ హయాంలో బాలయ్య వ్యవహారం ఇదే విధంగా ఉండటంతో బాలక్రిష్ణ కనిపించడం లేదంటూ నియోజకవర్గ ప్రజలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ విధంగా నే ఇప్పుడు కూడా బాలయ్య తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.అయితే తాను అందుబాటులో లేకపోయినా, తన అనుచరుల ద్వారా కూరగాయలు, టిఫిన్లు వంటివి పంపిణీ చేస్తున్న బాలకృష్ణ ప్రత్యక్షంగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో ఆయనకు క్రెడిట్ రాకపోగా, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నేడు తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల