టాలీవుడ్ లో వివాదానికి కారణం అయిన సిటీమార్ సాంగ్

డిజే సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ సిటీమార్ ని సల్మాన్ ఖాన్ మూవీ రాధేలో ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాని రాధే టీమ్ కి ఇచ్చేయడంతో పాటు మళ్ళీ సల్మాన్ ఖాన్ కోసం కొత్తగా కంపోజ్ చేశాడు.

ఈ సాంగ్ ఇప్పుడు బాలీవుడ్ లో దుమ్ములేపుతుంది.తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే రేంజ్ లో హిందీలో కూడా రెస్పాన్స్ వస్తుంది.

గతంలో కూడా కొన్ని తెలుగు పాటలని హిందీలోకి తీసుకెళ్లగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే సిటీమార్ హిందీ హిట్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ సాంగ్ టాలీవుడ్ లో వివాదానికి కారణం అయ్యిందనే టాక్ వినిపిస్తుంది.

దిల్ రాజు నిర్మించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలోనిది సిటీమార్ సాంగ్.అయితే ఈ సాంగ్స్ మీద సర్వ హక్కులని దిల్ రాజు ఆదిత్యా మ్యూజిక్ సంస్థకి అమ్మేశారు.

అమ్మేసిన తర్వాత ఆ సాంగ్స్ ని ఏ బాషలో అయిన రీమేక్ చేసుకుంటే కచ్చితంగా మ్యూజిక్ సంస్థ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే వారికి హక్కుల కోసం కొంత చెల్లించాలి.అయితే ఈ సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ ఆదిత్య మ్యూజిక్ సంస్థ పర్మిషన్ తీసుకోకుండా రాధే టీమ్ ఇచ్చేశాడని తెలుస్తుంది.

ఇది తన వర్క్ కాబట్టి తాను ఇచ్చుకోవచ్చనే అభిప్రాయంతో దేవిశ్రీ ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.

అయితే ఆదిత్య సంస్థ ఇప్పుడు ఈ సాంగ్ రీమేక్ పై నిర్మాత దిల్ రాజుని నిలదీసినట్లు తెలుస్తుంది.

దిల్ రాజుకి దేవిశ్రీప్రసాద్ తో సినిమాలు ఉండటంతో అతన్ని ఈ విషయంపై పెద్దగా అడగలేదని, అయితే ఆదిత్య మ్యూజిక్ సంస్థ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

చంద్రబాబుకు ప్రజల సమస్యలు అవసరం లేదు.. మంత్రి కారుమూరి ఫైర్