హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్ తల్లిపాల వారోత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: మహిళలకు మాతృత్వం అనేది ఓ గొప్ప అనుభూతి.అదొక అద్భుతమైన వరం.

దానిని పొందాలని అందరు తల్లులు ఆశ పడతారు.అయితే కొందరు మహిళలు అందం,శరీరాకృతి పోతుందని పిల్లలని కనడం మానేస్తూ వున్నారు .

కొంత మంది పిల్లలనికంటూ వున్నా పాలు మాత్రం ఇవ్వడం లేదు.ఈ పద్ధతి ఎంత మాత్రమూ సరికాదు.

తల్లిపాలు బిడ్డకి అమృతంతో సమానం.ఎదుగుదలకు పునాది.

అలాగే తల్లి పాలలో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు కావలసిన అన్ని పోషకాలు వుంటాయి కాన్పు అయిన మూడు రోజుల వరకు వచ్చే ముర్రుపాలు అనేవి *తొలి టీకా లాంటివి.

ఈ ముర్రుపాలు వలన వ్యాధి నిరోధక శక్తి( Immunity ) పెరుగుతుంది.పిల్లలకు ఆరు నెలలు వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.

కానీ.ఇప్పుడు సగంమంది కంటే తక్కువ పిల్లలకి మాత్రమే తల్లిపాలు మాత్రమే లభిస్తున్నాయి.

తల్లి పాలు ఇవ్వడం ద్వారా తల్లికి కలిగే ప్రయోజనాలు:-బిడ్డకి పాలివ్వడం ద్వారా రోజుకు 500 కేలరీలు అధికంగా ఖర్చు అవుతుంది.

దీని వలన గర్భధారణ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి సహాయపడింది బిడ్డకు పాలు ఇచ్చే స్త్రీలలో మధుమేహం( Diabetes), రక్తపోటు, హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.

రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం కూడా తక్కువేతల్లి పాలు ఇవ్వడం ద్వారా ప్రసవ అనంతరం జరిగే రక్తస్రావం తగ్గుతుంది.

పాలివ్వడం వల్ల తల్లికి మానసిక ఆనందం కల్గుతుంది.- బిడ్డకీ, తల్లి కి మధ్య ఆత్మీయ బంధం పెరిగి మాతృ భావన అనేది మరింత బలపడుతుంది.

తల్లి పాలు వలన - పిల్లలకి కలిగే లాభాలు:శిశువులకు తల్లిపాలు అనువైన ఆహారం.

ఇది సురక్షితమైనది, శుభ్రమైనది, అనేక సాధారణ బాల్య వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే ప్రతిరోధకాలను కలిగి ఉంటుంది.

శిశువు జీవితంలోని మొదటి నెలలకు అవసరమైన అన్ని శక్తిని మరియు పోషకాలను తల్లిపాలు అందిస్తుంది మరియు ఇది మొదటి సంవత్సరం రెండవ సగంలో పిల్లల పోషక అవసరాలలో సగం లేదా అంతకంటే ఎక్కువ, రెండవ సంవత్సరంలో మూడవ వంతు వరకు అందించడం కొనసాగిస్తుంది.

తల్లి పాలు తాగితే పిల్లలు ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు.అధిక, అసలు బరువు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా రావు.

తల్లిపాలు సులభంగా జీర్ణం అవుతాయిగ్యాస్ ప్రాబ్లెమ్ , మలబద్దకం లాంటివి తగ్గుతాయి ఆకస్మిక శిశు మరణాలు తక్కువ.

-చెవి సంబంధిత ఇన్ఫెక్షన్లు తక్కువగా వస్తాయిపిల్లలు ఆటపాటలల్లో రాణించడానికీ, క్యాన్సర్ వంటి మహమ్మారి,నుంచి రక్షించుకోవడానికి బిడ్డకి శ్రీరామరాక్ష తల్లి పాలు అని చెప్పవచ్చు.

తల్లి పాలు పిల్లల ఆరోగ్య జీవితానికి తొలిమెట్టు.అత్యంత పౌష్టిక విలువలు కలిగి వుంటాయి.

తల్లిపాలు అనేవి పిల్లలో వాత్సల్యం, అనుభూతి,తన్మయత్వం మరింతగా పెంచి సామాజిక విలువలను పెంచుతాయి.

కావున పిల్లలకు తల్లి పాలను మించిన దివ్యఔషధం అనేది మరొకటి లేదు.ఈ కాలంలో తల్లులు పురుషులతో పోటీపడి పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు.

ప్రధాన మంత్రులు అవుతున్నారు.రాష్ట్రపతులు అవుతున్నారు, పైలెట్లు కూడా అవుతున్నారు.

కానీ.మాతృత్వంలోని మాధుర్యాన్ని కోల్పోతున్నారు.

తల్లిపాలు అనేవి అమృతం అని ఆయుర్వేద నిపుణులు అయిన ఆచార్య కశ్యప చెప్పారు.

నవ మాసాలు మోసి, కన్న కలలు కనుల ముందు సాక్షాత్కారం అయినప్పుడు అప్రయత్నం గా ఆ తల్లి గుండెల్లో నుంచి పొంగు కొచ్చే చనుపాలు బిడ్డకు దివ్యామృతం.

తల్లిపాల వలన తల్లికి బిడ్డకు కలిగే లాభాలు ఆమోఘం మరియు అద్వితీయం.పిల్లలు పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు 44% మాత్రమే తల్లులు పాలు ఇస్తున్నారు.

0-23 నెలల నుండి సరైన తల్లి పాలు ఇవ్వడం ద్వారా 5 సంవత్సరాల కంటే తక్కవ వయస్సున్న 820,000 మంది పిల్లలు ప్రాణాలు కాపాడవచ్చు .

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న 46.

1% పిల్లలకు పుట్టిన వెంటనే పాలు అందుతున్నాయి.27- ఏప్రిల్ 2020.

గ్లోబల్ సర్వే ప్రకారం పుట్టిన పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం లో ప్రపంచం లో "శ్రీలంక"దేశం మొదటి స్థానం లో నిలిచింది.

68% మంది మహిళలు కనీసం ఒక సంవత్సరం పాటు తమ శిశువు కి తల్లి పాలు ఇవ్వడం కొనసాగిస్తే రెండు సంవత్సరాల వయస్సు లో,తల్లి పాల రేటు 44% కి తగ్గుతుంది.

తల్లి పాలలోని నురగతనం - అమృతం కంటే తియ్యదనం".త్రిమూర్తులలో ఒకరైన శివుని యొక్క భక్తురాలు అయిన బెజ్జమహాదేవి సైతం తన దేవున్ని కుమారునిగా భావించి పాలిచ్చి పెంచ సాగింది.

ఈ సపర్యకు గాను పరవశించి పోయిన శివుడు తానే ప్రత్యక్షం అయి ఏమి వరం కావాలో కోరుకొమ్మని అడిగాడు అంటే, పురాణ ఇతిహాసాలలో కూడా తల్లిపాల మహత్యం ఎంత గొప్పగా ఉందో మనం ఊహించుకోవచ్చు, కావున నేటి ఆధునిక తరానికి చెందిన మహిళలు పిల్లలకి పాలిచ్చి మంచి దృఢమైన ఆరోగ్యకరమైన పిల్లలను సమాజానికి అందించాలని మనసారా కోరుకుంటూ.

!తల్లి లేని శివుడు అయినా.తల్లిపాలకి పరవశించి పులకించి పోవాల్సిందే.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు…