ఆస్ట్రేలియాలో ఫేమస్ అవుతోన్న హిమాలయన్ శిలాజిత్.. ఎలా వాడుతున్నారంటే..?

ఇండియాలో సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదం( Ayurveda ) వేలాది సంవత్సరాలుగా ఉనికిలో ఉంది.

ఈ ఆయుర్వేదంలో శిలాజిత్ అనేది మూలికలు, ఖనిజాల కలయిక అని చెప్తారు.పూర్వకాలం నుంచి శిలాజిత్‌ను అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు.

సుశ్రుత సంహిత అనే గ్రంథం ప్రకారం, వేసవి కాలంలో ఎండ తీవ్రంగా ఉండటం వల్ల పర్వతాలపై ఉన్న మొక్కల నుంచి ఒక రకమైన జిగురు పదార్థం (శిలాజిత్) బయటకు వస్తుంది.

దీన్నే శిలాజిత్‌గా పేర్కొంటూ భారతదేశ వ్యాప్తంగా అమ్ముతున్నారు.ఈ మూలిక ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు.

"""/" / ఇప్పుడు పాశ్చాత్య దేశాలు కూడా ఈ శిలాజిత్ గురించి తెలుసుకుని దానిపై పరిశోధనలు చేస్తున్నాయి.

మన దేశంలో వేల సంవత్సరాల నుంచి తెలిసిన ఈ శిలాజిత్ గురించి ఇప్పుడిప్పుడే ఇతర దేశాలు తెలుసుకుంటున్నాయి.

తాజాగా ఆస్ట్రేలియా దేశంలోని ఒక కంపెనీ హిమాలయన్‌ శిలాజిత్‌( Himalayan Shilajit )ను సేల్ చేస్తుందని తెలిసి ఇండియన్స్ ఆశ్చర్యపోయారు.

అక్కడ కూడా శిలాజిత్‌కు చాలా డిమాండ్ ఉందా అని నోరెళ్లబెడుతున్నారు.ఈ ఆస్ట్రేలియన్‌ కంపెనీ శిలాజిత్‌( Shilajit )ను పాకిస్థాన్‌లోని గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతం నుంచి తెప్పిస్తుంది.

ఆ శిలాజిత్‌ను శుభ్రం చేసి, దుమ్ము మొదలైన వాటిని తొలగించి ఆస్ట్రేలియాలో ప్యాక్ చేసి సేల్ చేస్తుంది.

చాలామంది దీన్ని తెగ వాడేస్తున్నట్లుగా తెలుస్తోంది. """/" / హిమాలయన్ పవర్ శిలాజిత్ అనే కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ ఓ వీడియో కూడా షేర్ చేసింది.

ఇందులో ఒక ఆస్ట్రేలియా మహిళ ఈ మూలిక పదార్థాన్ని స్పూన్ తో ఇష్టంగా తింటున్నట్లు చూడవచ్చు.

ఇదే వీడియోలో కంపెనీ తమ ప్రొడక్ట్‌లో శరీరానికి అవసరమైన 102 పోషకాలలో 87 ఉన్నాయని తెలిపింది.

ఈ ప్రొడక్ట్ ఒక వారం పాటు తీసుకుంటే శరీరంలోని మెటబాలిజం పెరుగుతుందని, ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని, కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి కూడా తగ్గుతుంది అని చెప్పారు.

ఈ ఇన్‌స్టా రీల్స్ చూసిన భారతీయులందరూ నవ్వుకుంటున్నారు.ఎట్టకేలకు వెస్ట్రన్ కంట్రీస్ కూడా శిలాజిత్ ను కనిపెట్టేశాయి, భారతీయులు దీన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు కానీ తామే దాన్ని కనిపెట్టినట్టు వెస్ట్రన్ కంట్రీస్ నటిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్లు చేశారు.

కొరియన్ స్టార్ హృదయంలో నిలిచిన భారతీయ అభిమాని.. దశాబ్దం తర్వాత గుర్తుపట్టాడు..?