లక్ష్యం సాధించే క్రమంలో చావు కనిపించినా ముందుకే సాగి విజయాన్ని సాధించింది

విజయం సాధించాలనే పట్టుదల ఉంటే ఎంత పెద్ద ఇబ్బందులనైనా ఎదురించి ముందుకు సాగుతాం.

మన ముందు ఒక లక్ష్యంను ఏర్పర్చుకుంటే దాన్ని సాధించేందుకు పట్టుదలతో కృషి చేసి విజయాన్ని సాధించం పెద్ద సమస్య ఇబ్బంది కాదు.

కృషితో నాస్తి దుర్బిక్షం అన్నట్లుగా కష్ట పడితే సాధ్యం కానిది ఏమీ లేదు.

ప్రాణాల మీదకు వచ్చే వరకు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందని బక్షో దేవి నిరూపించింది.

ఆమె తన క్లాస్‌ పిల్లలకు మాత్రమే కాకుండా ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.

"""/"/  బక్షోదేవి కొన్నాళ్ల క్రితం దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది.ఆ అమ్మాయి రన్నింగ్‌ రేసులో కనబర్చిన ప్రతిభకు అంతా కూడా ఫిదా అయ్యారు.

అద్బుతమైన ఆమె రన్నింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి.కాని తన లక్ష్యం ముందు ఆ ఇబ్బందులను చిన్నవిగానే చూసింది.

అందుకే ఆమె రన్నింగ్‌ రేసులో అందరి కంటే ముందుగానే ఆమె నిలిచింది.ఆమె చేసిన ప్రయత్నంను ప్రతి ఒక్కరు అభినందిస్తూనే ఉన్నారు.

ఆ క్రమంలో ఆమె చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది.అయినా పట్టుదల వదల్లేదు.

విజయం సాధించనప్పుడు చనిపోయినా పర్వాలేదు అనేది ఆమె నమ్మిన సిద్దాంతం. """/"/  ఆ సిద్దాంతం ప్రకారం ఆమె చావు నొప్పిని కూడా భరించి పరుగు పెట్టింది.

ఆమె పెట్టిన పరుగుకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది.హిమాచల్‌ ప్రదేశ్‌ ఉనా జిల్లాకు చెందిన బక్షో దేవి అప్పుడు 9వ తరగతి చదువుతోంది.

ఆ సమయంలో స్కూల్‌లో రన్నింగ్‌ రేసు పెట్టారు.పరుగు అంటే ప్రాణం, ఎప్పుడు కూడా రన్నింగ్‌ రేస్‌ పెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయడం బక్షోదేవి లక్ష్యం.

ఆరోజు కూడా ఆమె పరుగు పెందెంలో గెలుపొందడం ఖాయం అనుకున్నారు.కాని ఎవరికి తెలియని విషయం ఏంటీ అంటే ఆమె కొన్ని రోజుల ముందు కిడ్నీలో రాళ్ల సమస్య కారణంగా తీవ్రమైన కడుపు మరియు వెన్ను నొప్పితో బాధ పడింది.

"""/"/  ఆ బాధ రన్నింగ్‌ సమయంకు లేదు.కాని రన్నింగ్‌ చేస్తుంటే కచ్చితంగా ఆ బాధ మళ్లీ పెట్టడం ఖాయం అని బక్షోదేవికి తెలుసు.

అయినా కూడా వదిలేయాలని అనుకోలేదు.తనవంతు ప్రయత్నం చేయాలని భావించింది.

గెలిచేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించాలని బరిలోకి దిగింది.విజిల్‌ సౌండ్‌ రాగానే అంతా పరుగెత్తారు.

జెట్‌ స్పీడ్‌తో బక్షోదేవి పరుగు లంకించుకుంది. """/"/  ఆ పరుగులో ముందుకు దూసుకు పోతుంది.

కొద్ది దూరం పోయాక ఆమెకు విపరీతమైన నొప్పి స్టార్ట్‌ అయ్యింది.ఆ నొప్పితో పాటు రక్తం కూడా వస్తోంది.

వాటన్నింటిని పట్టించుకోకుండా బక్షోదేవి ముందుకు సాగింది.అందరికంటే ముందుగానే లక్ష్యం చేరి తన పరుగు పూర్తి చేసింది.

ఈ విజయంకు ఆమె పడ్డ కష్టంను అక్కడున్న వారు మాత్రమే కాకుండా దేశం మొత్తం చూసింది.

ఆమె పట్టుదలకు హ్యాట్సాప్‌ చెప్పడం జరిగింది.పట్టుదలతో తలిస్తే సాధించొచ్చు అని ఈ బాలిక నిరూపించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు భారీ స్థాయిలో క్రేజ్.. ఈ సీక్వెల్స్ హిట్టవుతాయా?