నల్గొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం నందిని, బాలమ్మ వర్గాలకు చెందిన హిజ్రాలు వీరంగం సృష్టించారు.
పంపకాల్లో తేడా రావడంతో పరస్పరం కారం,చెప్పులు విసురుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు.ఈ ఘటనలో పోలీసులకు రాళ్ళు తగిలి గాయాలయ్యాయి.
వీరి మధ్య దుకాణాల వద్ద డబ్బులు వసూళ్ల విషయంలో తరచూ గొడవలు అవుతున్నట్లు తెలుస్తోంది.
నందిని గ్రూపుకి చెందిన గంగభవాని అనే హిజ్రా 15 రోజుల క్రితం బాలమ్మ గ్రూపులోకి వెళ్ళింది.
అప్పటి నుండి ఆర్ధిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య వివాదం ముదిరింది.తమ అనుమతి లేకుండా మా సభ్యురాలిని ఎలా చేర్చుకున్నారంటూ బాలమ్మ గ్రూపుపై నందిని గ్రూప్ ఆగ్రహంతో ఉంది.
ఈ వివాదంపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి.
అందరిని కూర్చోవాలని చెప్పి ఎస్సై బయటకి వెళ్లాడు.ఈ క్రమంలోనే రెండు వర్గాల హిజ్రాలు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కొట్లాటకు దిగడంతో స్టేషన్ అవరణం రణరంగంగా మారింది.
వీరి కొట్లాట చూసి పోలీసులే హడలెత్తిపోయారు.ఖాకీల ముందే హిజ్రాల సిగపట్ల కొట్లాటతో పోలీస్ స్టేషన్ హోరెత్తిపోయింది.
అయితే కాసేపటికి తేరుకున్న పోలీసులు హిజ్రాలను చెదరగొట్టారు.కాగా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమపై నందిని వర్గం హిజ్రాలు సూర్యాపేట,దేవరకొండ నుంచి కొంత మంది మగవారిని తీసుకొచ్చి దాడి చేయించారని గంగాభవాని అనే హిజ్రా ఆరోపిస్తోంది.
కాగా ప్రత్యర్థి వర్గం తనను చంపుతానని బెదిరిస్తోందని బాలమ్మ ఆరోపిస్తోంది.హిజ్రాల వీరంగంపై ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకున్నారు.
ఆర్ధిక లావాదేవీలే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.ఇరువర్గాలపై కేసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
స్టార్ హీరోయిన్ రష్మిక జోరుకు బ్రేకులు వేసిన సికిందర్.. రష్మిక ఫ్లాపుల పరంపర మొదలైందా?