హిజ్రాల వీరంగం.. ప్రయాణికుడి దారుణ హత్య! వీడియో వైరల్

ప్రస్తుత కాలంలో రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అందులో ముఖ్యంగా హిజ్రాల( Hijras ) అల్లరికి సంబంధించిన ఘటనలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రైళ్లలో( Trains ) హిజ్రాల గ్యాంగ్‌లు ప్రయాణికులను వేధిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి.

వీరు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ తమ కోరిక నెరవేరకపోతే అసభ్య ప్రవర్తన చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఈ హిజ్రాల సంస్కృతి రైల్వే ప్రయాణాల్లో అత్యధికంగా కనిపిస్తుండటమే కాకుండా, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో మరింత విపరీతంగా కనిపిస్తోంది.

చాలా సందర్భాల్లో వీరు నగ్నంగా ప్రవర్తించి, డబ్బులు ఇవ్వకపోతే అసభ్యంగా మసలుకుంటూ ప్రయాణికులను బలవంతంగా డబ్బులు ఇవ్వేలా చేస్తుంటారు.

మరికొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్న వ్యక్తులపై దాడులకు కూడా పాల్పడుతున్నారు. """/" / ఇటీవల మధ్యప్రదేశ్‌లోని గోండ్వాన ఎక్స్‌ప్రెస్‌( Gondwana Express ) రైల్లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.

కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.ఆదర్శ్ వర్మ( Adarsh Verma ) అనే ప్రయాణికుడు గోండ్వాన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో హిజ్రాల గ్యాంగ్ అతని వద్ద డబ్బులు డిమాండ్ చేసింది.

అయితే, అతను డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహించిన హిజ్రాలు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.

కంపార్ట్మెంట్‌లో అందరూ చూస్తుండగానే యువకుడిని కిందపడేసి, తొక్కుతూ దారుణంగా చితకబాదారు.తీవ్ర గాయాల కారణంగా అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

హత్య అనంతరం హిజ్రాలు అతని మృతదేహాన్ని రన్నింగ్ రైలు నుంచి కిందికి తోసేశారు.

"""/" / ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రయాణికుడిని హత్య చేసిన హిజ్రాల గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుని కుటుంబ సభ్యులతో పాటు పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో రైళ్లలో హిజ్రాల గ్యాంగ్‌లు ప్రయాణికులను వేధించడం, డబ్బులు ఇవ్వకుంటే దాడులకు దిగడం వంటి ఘటనలు పెరుగుతుండటంతో, ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు రైల్వే భద్రతా దళాలు మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే, ప్రయాణికులు తమ భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయం స్పష్టమవుతోంది.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters