యాదాద్రిలో పార్కింగ్ మోత..!
TeluguStop.com
యాదాద్రికి వెళ్లే భక్తులకు పార్కింగ్ ఫీజ్ తో షాక్ ఇచ్చింది దేవస్థానం.యాదగిరి గుట్ట దేవస్థానం చేరుకునే భక్తులకు పార్కింగ్ ఫీజు మోత మోగనుంది.
యాదాద్రికి వెళ్లే కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు కొండపైన పార్కింగ్ చేస్తే జేబులు ఖాళీ అయినట్టే.
అక్కడ పార్కింగ్ కోసం గంటకు 500 రూపాయలు వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది.
గంట దాటితే ప్రతి గంటకు 100 రూపాయలు వసూలు చేస్తారట.ఈ పార్కింగ్ ఫీజుని కన్ఫర్మ్ చేస్తూ దేవస్థానం ఈవో గీతా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈరోజు నుండి ఈ కొత్త పార్కింగ్ ఫీజులు అమలులో ఉంటాయి.మార్చి 28 ప్రధానాలయం ఉద్ఘాటన జరుగగా.
ఆరోజు నుండి భక్తుల వాహనాలు కొండపైకి అనుమతించడం లేదు.కేవలం ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులు కొండపైకి.
కిందకు వస్తున్నారు.అయితే భక్తులు తమ వాహనాలను అనుమతించాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నతస్థాయి అధికారులు, న్యాయమూర్తుల ప్రోటోకాల్ వెహికల్స్ కు పార్కింగ్ ఫీజు మినహాయించారు.
దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతలకు పార్కింగ్ ఫీజు ఉండదని తెలుస్తుంది.అయితే టూ వీలర్స్ కు మాత్రం పాత ఫీజు 15 రూపాయలనే వసూలు చేస్తున్నారు.
అయితే దేవస్థానం తీసుకున్న ఈ పార్కింగ్ ఫీజులపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.
బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ బలి కావడం ఖాయమా?