కొత్త ట్రాఫిల్ రూల్స్ తో జరా భద్రం
TeluguStop.com
ఇక కొత్త ట్రాఫిక్ రూల్స్ తో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఇక ఇప్పటివరకు ఒక లెక్క,ఇక నుంచి ఒక లెక్క అన్నమాట.
ట్రాఫిక్ రూల్స్ ని గనుక ఉల్లంఘిస్తే ఇక అధికారులు మాత్రం ఉపేక్షించరు.ఇప్పటివరకూ ఏదో నామమాత్రంగా ఉన్న జరిమానాలను ఇప్పుడు భారీ గా పెంచేశారు.
రోడ్డుప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికే భారీ జరిమానాలు అని అధికారులు చెబుతుంటే.మరోవైపు ఇంత భారం మోపడం తగదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మొదటగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పైనే ఎక్కువ గురి పెడుతున్నారు అధికారులు.ఆ తర్వాత మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులు, సంరక్షకులకు పాతిక వేల జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష కూడా విధించనున్నట్లు తెలుస్తుంది.
ప్రత్యామ్నాయ మార్గాల విషయంలో ట్రాఫిక్ పోలీసులు చెప్పింది వినకపోతే ఇప్పటివరకు రూ.500 జరిమానా ఉండేది.
ఇకపై రూ.2 వేల ముక్కు పిండి వసూలు చేస్తారట.
"""/"/
కాలం చెల్లి.ఉత్తుత్తి ఫిట్‌నెస్ ధ్రువపత్రాలతో రాకపోకలు కొనసాగిస్తున్న ప్రజా రవాణా వాహనాలు, పాఠశాల వ్యాన్‌లు, బస్సులు, లారీలు, ఆటోలు, కార్ల యజమానుల నిర్లక్ష్య ధోరణి ఇకపై చెల్లదు.
వాహనాల స్థితిగతులను పరిశీలించేందుకు వాటిని తయారుచేసిన సంస్థల, విడిభాగాలు అమర్చిన కంపెనీల ధ్రువీకరణ పత్రాలు వాహనంలో తప్పనిసరిగా ఉండాలి.
ఇలా పలు కఠిన నియమాలను ప్రభుత్వం పాటించనుంది.
వైరల్ వీడియో: ఈ బుల్లి ఎలుగుబంటి అల్లరి మాములుగా లేదుగా