ఏలూరు జిల్లా తణుకులో హైటెన్షన్

ఏలూరు జిల్లా తణుకులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఇవాళ అమరావతి రైతుల పాదయాత్ర తణుకులో ప్రవేశించనుంది.

ఈ క్రమంలో పాదయాత్రను అడ్డుకోవాలని మంత్రి కారుమూరి పిలుపునిచ్చారు.అంతేకాకుండా ప్రజాప్రతినిధులు, ప్రజలు శాంతియుత నిరసన తెలపాలని సూచించారు.

మరోవైపు రాత్రికి రాత్రే తణుకులో పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.ఈ నేపథ్యంలో మంత్రి పిలుపుతో పోలీస్ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

ఇరు వర్గాల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి