అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టు ముట్టారు.

పెదపప్పూరు మండలం తిమ్మంచెరువు గ్రామంలో ఉన్న శ్రీ వజ్రగిరి లక్ష్మీనరసింహా స్వామివారి ఆలయం వద్ద కల్యాణ మండపానికి భూమి పూజ చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధం అయ్యారు.

ఈ క్రమంలో ఆయన బయటకు రాకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

అయితే ఆ ఆలయానికి సంబంధించి ఓ వివాదం ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది.

ఈ సమయంలో ఆలయ కల్యాణ మండపానికి భూమి పూజ చేసేందుకు ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఏపీకి మళ్లీ జగనే సీఎం అని చెప్పిన ఆరా మస్తాన్.. అన్ని స్థానాలతో సంచలనం!