పల్నాడు జిల్లా మాచర్లలో హై టెన్షన్..!!
TeluguStop.com
పల్నాడు జిల్లా( Palnadu District) మాచర్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.మాచర్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే పట్టణంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.అదనపు బలగాలతో మాచర్ల పట్టణం పోలీసుల అదుపులో ఉంది.
మరోవైపు దాచేపల్లి మండలం మాదినపాడులో ఉద్రిక్తత ఏర్పడింది.రెండు పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది.
వివాదం కాస్తా ముదరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎన్నికల పోలింగ్( Election Polling ) కు మొదలైన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..