సూర్యాపేట జిల్లా మోతే మండలంలో హై టెన్షన్..!

సూర్యాపేట జిల్లా మోతే మండలం విమలాపురం అప్పనగూడెం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.గత కొన్ని రోజులుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అనర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే స్థానికులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమించారు.

అయితే ఇప్పటికే కొందరికి అధికారులు ఇళ్లను కేటాయించారు.ఈ నేపథ్యంలో ఇళ్లు కేటాయించిన వారికి, స్థానికులు మధ్య వివాదం చెలరేగింది.

అది కాస్తా ముదరడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వారం రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. టీమిండియా సెలక్షన్ కమిటీకి సంకేతాలు ఇస్తున్నాడుగా?