నంద్యాల పట్టణంలో టెన్షన్ వాతావరణం ..

నంద్యాల పట్టణం( Nandyal )లో బుధవారం ఉదయం టెన్షన్ వాతావరణం నెలకొంది.నిన్న రాత్రి కొత్తపల్లి గ్రామంలో లోకేష్ పాదయాత్ర( Lokesh Padayatra )లో ఏవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రీ భూమా అఖిలప్రియ వర్గీయులు దాడి జరిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున ఆళ్లగడ్డలోని అఖిలప్రియ( Akhila Priya ) స్వగృహం వద్ద పోలీసులు చుట్టుముట్టి ఉదయం 8 గంటల సమయంలో మాజీ మంత్రి అఖిలప్రియతో పాటూ, భర్త భార్గవ్ రామ్, పీఏ మోహన్ ను మరియు ఇద్దరు అనుచరులను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకొని నంద్యాలకు తరలించారు.

ఈ అనూహ్య పరిణామంతో ఏమి జరుగుతుందో తెలియక ఆళ్లగడ్డలో ఇటు నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

నంద్యాలలో ఈరోజు లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యగా మాజీ మంత్రి అఖిలప్రియ అదుపులోకి తీసుకున్నారా?? లేక??నిన్న జరిగిన సంఘటనలో అదుపులోకి తీసుకున్నారా??అన్న విషయం పై అంతా చర్చించుకుంటున్నారు.

ఆ ఆరోగ్య సమస్య వల్ల బెయిల్ ఇవ్వాలంటున్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?