కర్నూలులో హైటెన్షన్..!
TeluguStop.com
కర్నూలు జిల్లా విశ్వభారతి హాస్పిటల్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.విశ్వభారతి ఆస్పత్రిలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మీకి చికిత్స కొనసాగుతోంది.
దీంతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆస్పత్రి వద్దనే ఉన్నారు.మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న రెండు సీబీఐ అధికారుల బృందాలు కర్నూలు చేరుకున్నారు.
అయితే ఇవాళ సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాల్సి ఉండగా.తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాలేనంటూ ఆయన సీబీఐ అధికారులకు లేఖ రాశారు.
అటు వైసీపీ కార్యకర్తలు, నేతలు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటుండగా.ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు.
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీయార్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తారా..?