ఢిల్లీలో హైటెన్షన్.. రౌస్ అవెన్యూ కోర్టుకు సిసోడియా

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా ఏ1 గా చేర్చారు సీబీఐ అధికారులు.

ఇందులో భాగంగా కేసు దర్యాప్తు కోసం సిసోడియాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా పాత్రను సీబీఐ కోర్టుకు వివరించారు.

అయితే బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా కోర్టును కోరారు.తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు.

మరోవైపు ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.మనీశ్ సిసోడియాను కోర్టుకు తరలించే సమయంలో ఆప్ కార్యకర్తలను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఆప్ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

వీడియో: భార్య కోసం ఉద్యోగానికి రాజీనామా.. అదే రోజు ఆమె మృతి చెందడంతో?