Narendra Modi : ఉన్నతవిద్యలో ఉన్నత ప్రమాణాలకు పెద్ద పీట..: మోదీ
TeluguStop.com
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యాసంస్థలు( Central Educational Institutions ) ప్రారంభం అయ్యాయి.
ఈ మేరకు ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలు జాతికి అంకితం చేయబడ్డాయి.
అలాగే ఐఐఎం విశాఖ, ఐఐఐటీడీఎ కర్నూల్ శాశ్వత క్యాంపస్ లతో పాటు ఐఐటీ హైదరాబాద్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామన్నారు.
"""/" / కశ్మీర్ ( Kashmir )అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్న మోదీ యువశక్తి, నారీ శక్తి, పేదలు మరియు రైతులకు తమ ప్రభుత్వం ఉండగా ఉంటుందని తెలిపారు.
ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.ఈ క్రమంలో పదేళ్లుగా ఉన్నతవిద్యలో ఉన్నత ప్రమాణాలకు పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు.
మోదీ గ్యారెంటీ అంటే ఇలా ఉంటుందని వెల్లడించారు.ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటుపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.
విద్యార్థులకు ఆధునిక శిక్షణ కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడమని చెప్పారు.2004 కు ముందు జమ్ముకశ్మీర్ లో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 12 కాలేజీలకు పెంచామని తెలిపారు.
బేబీబంప్ తో షాక్ ఇచ్చిన సమంత… వైరల్ అవుతున్న బేబీబంప్ ఫోటో?