ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజు ‘లుం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేటు పాఠశాలలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, మొబైల్ యాప్ ల పేరిట అదనపు చార్జీలు వేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు సోమవారం బీజేవైఎం మండల అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోనీ ప్రైవేటు పాఠశాలలను సందర్శించారు.

పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీతో ఫీజుల నిర్మాణ పట్టిక ను అడగ్గా పాఠశాల విద్యా కమిటీ సమావేశం ఏర్పాటుచేసి విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఫీజుల నిర్మాణ పట్టికను తయారుచేసి, పాఠశాలలో ఉన్న బస్సుల పర్మిట్లకు సంబంధించి వివిధ విషయాలకు సంబంధించి పూర్తి నివేదికను మండల విద్యాధికారి కి సమర్పించామని తెలిపారు.

పాఠశాలలో ఉన్న ఫీజుల నిర్మాణ పట్టికను చూస్తే కనీసం విద్యా కమిటీ సభ్యుల సంతకాలు లేకుండా అప్పటికప్పుడు తయారు చేసినట్లు ఉందని ఇలా ఉందని పాఠశాల యజమాన్యాన్ని అడిగితే పూర్తి నివేదిక మండల విద్యాధికారి వద్ద ఉంది వెళ్లి తెలుసుకోవాలి అని పొంతనలేని సమాధానాలు చెప్పడం జరిగిందన్నారు.

బీజేవైఎం నాయకులు వెంటనే మండల విద్యాధికారి నీ వెళ్లి లిఖితపూర్వకంగా మండల కేంద్రంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలలో అధిక ఫీజుల వసూళ్లు, మొబైల్ యాప్ లా పేరిట అదనపు చార్జీలు వసూళ్లు, స్కూల్ బస్సుల పర్మిట్ల సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి కి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక కుమార్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డి, మండల కార్యదర్శి అరవింద్ గౌడ్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాష్, కో కన్వీనర్ నరేందర్ పటేల్, బీజేవైఎం నాయకులు బొమ్మేడ శ్రీకాంత్ చరణ్ గౌడ్, రోహిత్, చందు, దుమాల దేవయ్య, బాబు, మహేందర్, నవీన్, వర్కుటి రాజు తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: ఇవే తగ్గిచుకుంటే బాగుపడతారు.. ముంబై లోకల్ ట్రైన్‌లో డేంజర్ స్టంట్..