విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టేటస్ కో

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది.కార్యాలయాల తరలింపు జీవో పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ క్రమంలో పిటిషన్ పై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసే వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని హైకోర్టు వెల్లడించింది.

అయితే విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రజాధనం వృథా అవుతుందని అందుకే ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపుపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

సూపర్ హీరో పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ.. ఈ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!