వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు హైకోర్టు నోటీసులు
TeluguStop.com
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.బ్రాహ్మణపల్లిలో 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి రూ.
50 కోట్లు రుణం పొందారని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు వినుకొండకు చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ వేశారని సమాచారం.
దీంతో విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి నోటీసులు జారీ చేసింది.
అదేవిధంగా ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మొటిమల నుంచి పొడి చర్మం వరకు కలబందతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?