పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మార్చే యోచనలో హైకమాండ్..!!
TeluguStop.com
పెద్దపల్లి పార్లమెంట్( Peddapally Parliament ) నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే లోక్ సభ అభ్యర్థిని మార్చాలని బీజేపీ అధిష్టానం యోచనలో ఉందని తెలుస్తోంది.
ఈ మేరకు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్( Gomasa Srinivas ) ను పార్టీ హైకమాండ్ హోల్డ్ లో పెట్టింది.
గోమాస శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండటం లేదని అధిష్టానానికి రిపోర్ట్ అందిందని తెలుస్తోంది.
అదేవిధంగా గోమాస శ్రీనివాస్ పార్టీ క్యాడర్ ను కూడా కలుపుకుని పోవడం లేదని, పార్టీ కార్యక్రమాలు మినహా సొంతంగా ఏం చేయడం లేదని ఓ రిపోర్ట్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది.
దీతో పెద్దపల్లి అభ్యర్థి ఫోటోలతో ప్రచారం చేయొద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
మోదీ, బీజేపీ( Modi ,BJP ) పేరు మీదున్న జెండాలతోనే ప్రచారం చేయాలని సూచనలు చేసిందని సమాచారం.
అయితే అభ్యర్థి మార్పు వ్యవహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, నాని సినిమాల మధ్య పోటీ.. 2026లో జరగబోయేది ఇదే!