మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో హై అలర్ట్
TeluguStop.com
నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్ నెలకొంది.కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారన్న అనుమానంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పనులు పూర్తికాకముందే కాళేశ్వరం ప్యాకేజీ 27ను ప్రారంభించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ గుండంపల్లిలో పచ్చిని పొలాల మధ్య ఇథనాల్ ప్లాంట్ ను నిర్మించడం సరికాదన్నారు.
మరోవైపు గుండంపల్లి వద్ద పలువురు ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.
బిగ్ బాస్ సీజన్8 అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరిగిందా?